/rtv/media/media_files/2025/11/25/zelensky-rejects-trump-28-point-peace-plan-2025-11-25-19-19-59.jpg)
Zelensky rejects Trump 28 point peace plan
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని(Russia Ukraine War) ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) 28 సూత్రాలతో కూడిన శాంతి ప్రతిపాదనను రూపొందించిన సంగతి తెలిసిందే. దీని వారం రోజుల్లోగా అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(zelensky) పై ఆయన ఒత్తిడి తీసుకొచ్చినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కానీ జెలెన్‌స్కీ మాత్రం ఈ ప్లాన్‌ను తిరస్కరించారు. ఈ ప్రతిపాదనలో రష్యాకు పలు అంశాలు అనుకూలంగా ఉండటంతో ఆయన దీన్ని నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: స్నేహమంటూనే చైనా మరో కుట్ర.. సరిహద్దుల్లో డ్రోన్ పరీక్షా కేంద్రం ఏర్పాటు
ట్రంప్ ప్రతిపాదనలు ఏంటి ?
ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికను చూసుకుంటే ఉక్రెయిన్.. క్రిమియా, డాన్‌బాస్, లుహాన్స్క్‌తో సహా ఖేర్సన్, జపోరిజియాలో కొంత భూభాగాన్ని రష్యాకు అప్పగించాలి. భవిష్యత్తులో ఎట్టిపరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరొద్దు. రష్యా నుంచి ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ఇచ్చినందుకు గాను అమెరికాకు పరిహారం తీసుకుంటుంది. ఒకవేళ రష్యాపై ఉక్రెయిన్ దాడి చేస్తే ఈ హామీలు రద్దు అవుతాయి. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రష్యాను తిరిగి విలీనం చేసేందుకు, దశలవారీగా ఆంక్షలను ఎత్తివేయాలి. చమురు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు వంటి పరస్పర ప్రయోజనం ఉండే రంగాల్లో అమెరికా రష్యాతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం.. అలాగే G8 కూటమిలో రష్యాను తిరిగి చేరేందుకు అవకాశం కల్పించడం లాంటి ప్రతిపాదనలు అమెరికా రూపొందించింది.
జెలెన్‌స్కీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
అయితే జెలెన్‌స్కీ మాత్రం ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నారు. ఈ ప్రతిపాదనాల్లో కీలకమైంది ఉక్రెయిన్ భూభాగాలను రష్యాకు అప్పగించడం. అయితే తమ భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునేది లేదని జెలెన్‌స్కీ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. ఇప్పుడు కూడా జెలెన్‌స్కీ మళ్లీ అదే చెబుతున్నారు. రష్యాకు తమ భూభాగాన్ని ఇవ్వడం అంటే దేశ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే నిబంధనకు కూడా జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది తమ భవిష్యత్తు భద్రతకు ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. నాటోలో చేరితే రష్యా నుంచి శాశ్వత భద్రతను అందిస్తుందని భావిస్తున్నారు.
Also Read: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..పెరిగిన స్పాట్ బుకింగ్స్
ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల ప్రణాళిక రష్యాకు అనుకూలంగా ఉంటే ఉక్రెయిన్‌కు మాత్రం ప్రతికూలంగా ఉందని ఉక్రెయిన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ప్రణాళిక అమెరికాది కాదని.. రష్యాకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి(పుతిన్‌ను ఉద్దేశిస్తూ) అమెరికా సెనేటర్లు కూడా చెప్పారని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ట్రంప్ ప్రతిపాదనలు అంగీకరించేందుకు నిరాకరిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని.. తమ దేశ ప్రయోజనాల కోసం అవసరమైతే అమెరికాతో స్నేహాన్ని కూడా వదులుకుంటామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
Follow Us