Sindh: పాకిస్తాన్ లోని సింధ్ లో హిందూ జనాభా ఎంత? ఈ ప్రావిన్స్ ఎందుకు ముఖ్యమైనది?

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ చుట్టూ జరిగిన ఆకస్మిక చర్చ భారత్-పాకిస్తాన్ సంబంధాలలో కొత్త సంచలనం సృష్టించింది.హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటన భవిష్యత్తులో సింధ్ భారతదేశంలో చేరే అవకాశం గురించి ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

New Update
sindh

పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతం భారత్ లో కలిసి పోతుంది అని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. సరిహద్దులు మారవచ్చని, సింధ్ ఒకరోజు భారతదేశంలో భాగమవుతుందని ఆయన అన్నారు. ఇది ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు కోలాహాలం రేపింది. రాజ్ నాథ్ సింగ్ ఎందుకు ఇలా మాట్లాడారు. సింధ్ ప్రావిన్స్‌లోని హిందూ జనాభాను మరియు జనాభా పరంగా ఈ ప్రావిన్స్ పాకిస్తాన్‌కు ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు చూద్దాం.

నాలుగో వంతు హిందువులు..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, "... నేడు, సింధ్ భూమి భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత ప్రకారం, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుంది. సరిహద్దులు మారవచ్చు. ఎవరికి తెలుసు, రేపు సింధ్ మళ్ళీ భారతదేశానికి తిరిగి రావచ్చు అన్నారు. సింధ్ లో మొత్తం జనాభా దాదాపు 55.70 మిలియన్ల మంది ఉన్నారు. ఇందులో దాదాపు 4.9 మిలియన్లు హిందువులు ఉన్నారు. అంటే మొత్తం సింధ్ జనాభాలో హిందువులు 8.8% మంది. వీరిలో షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వారు కూడా ఉన్నారు. అన్నిటి కంటేముఖ్యమైనది..పాకిస్తాన్ లో అత్యధిక శాతం హిందూ జనాభా కలిగిన ప్రావిన్స్ సింధ్.

భారత్ ప్రాబల్యం పెరుగుతుంది..

పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డిజిటల్ సెన్సస్ నివేదిక ప్రకారం, సింధ్ జనాభా దాదాపు 55.69 మిలియన్లు (55.69 కోట్లు). అదే 2023 జనాభా లెక్కల ప్రకారం, పాకిస్తాన్ మొత్తం జనాభా దాదాపు 241.49 మిలియన్లు. అంటే ఇందులో సింధ్ జనాభా 23 శాతంగా ఉన్నారు. ఇంకోలా చెప్పాలంటే పాకిస్తాన్ జనాభాలో నాలుగో వంతుల మంది సింధ్ ప్రావిన్స్ లో నివసిస్తున్నారు. ఈ జనాభా భారత్ లో కలిస్తే మన దేశ జనాభాలో భారీ మార్పు జరుగుతుంది. మన దేశ జనాభా మరో 3.8 శాతం పెరుగుతుంది. దాంతో పాటూ పాకిస్తాన్ ప్రాబల్యం కూడా తగ్గుతుంది. ఆ దేశంలో ముఖ్యమైన ప్రదేశం భారత్ లో కలవడం వలన భారత శక్తి మరింత పెరుగుతుంది.

Also Read: Bangladesh: బంగ్లాదేశ్ లో విపరీతంగా పెరిగిన నేరస్తులు..గందరగోళంలో దేశం

Advertisment
తాజా కథనాలు