Bangladesh: బంగ్లాదేశ్ లో విపరీతంగా పెరిగిన నేరస్తులు..గందరగోళంలో దేశం

తాత్కాలిక సారథి యూనస్ ప్రభుత్వంలో బంగ్లాదేశ్ లో నేరస్తులు విపరీతంగా పెరిగిపోయారని నివేదికలు చెబుతున్నాయి. అక్కడ పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారని..దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చెబుతున్నారు.

New Update
bangladesh

బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మహమ్మద్ యూనస్ తాత్కాలిక సారథిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమీ బాగా లేదని తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రజలు ఆందోళనగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. దీనంతటికీ కారణం బంగ్లాలో నేరాలు విపరీతంగా పెరిగిపోవడమే అని చెబుతున్నారు. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బంగ్లాదేశ్ లో పరిస్థితి దిగజారిందని తెలుస్తోంది. హింపాత్మకఘటనలు సర్వసాధారణంగా యారాయని అంటున్నారు. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు ఏం చేయడం లేదని చెబుతున్నారు.

గణనీయంగా పెరుగుతున్న నేరాలు..

బంగ్లాదేశ్ మీడియా స్వయంగా అక్కడ పెరుగుతున్న నేర గణాంకాల మీద ఆందోళన వ్యక్తం చేసింది. అయితే బంగ్లా పోలీసులు మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని చెబుతున్నారు. కానీ అది నిజం కాదని..అప్పుడు ప్రతీ నేరం పోలీస్ రికార్డ్ లలో నమోదు కాలేదని..ఇప్పుడు అన్నీ నమోదవుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో సోషల్ మీడియా ఆధారంగా కేసులు నమోదు చేయడంలో మునుపటి కంటే ఎక్కువ సహాయం పొందుతోందని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో, నేర సంఘటనలు సకాలంలో నమోదు కాలేదు అందుకే...అప్పటి కంటే ఇప్పుడు నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని క్లియర్ గా తెలుస్తుందని చెబుతున్నారు. రీసెంట్ గా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు కూడా దేశంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్, బంగ్లాదేశ్‌లో ఖైదు చేయబడిన అవామి లీగ్ నాయకులు, కార్యకర్తలను చట్టవిరుద్ధంగా చంపారని ఆయన ఆరోపించారు. అలాగే అక్కడ రాజకీయ పార్టీ మధ్య కూడా ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు ఏదో ఒక విధమైన ఆందోళన అక్కడ చెలరేగుతూనే ఉంది. ఇవన్నీ కలిపి బంగ్లాదేశ్ లో నేరాలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణమయ్యాయిని చెబుతున్నారు.

Also Read: Delhi Bomb Blast: 10 అడుగుల భూగర్భంలో మదర్సా..ఉగ్రవాది ముజమ్మిల్ ప్లాన్ ఏంటి? దీని వెనుక రహస్యం ఏంటి?

Advertisment
తాజా కథనాలు