Pakistan: మింగ మెతుకు లేదు.. అయినా బంగ్లాదేశ్కు పాక్ లక్ష టన్నుల బియ్యం.. ఎందుకో తెలుసా?

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు మొదలైన తర్వాత అధికారంలోకి వచ్చిన యూనస్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపర్చుకుంటోంది. ఇప్పటికే పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది.

New Update
Pakistan seeks to buy 100,000 tonnes of rice for supply to Bangladesh

Pakistan seeks to buy 100,000 tonnes of rice for supply to Bangladesh

బంగ్లాదేశ్‌(bangladesh)లో తిరుగుబాటు మొదలైన తర్వాత అధికారంలోకి వచ్చిన యూనస్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపర్చుకుంటోంది. ఇప్పటికే పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. పాక్‌ నిఘా సంస్థ ISIకి ఢాకా స్థావరంగా మారిందని ఇటీవల ఓ నివేదిక తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్‌కు ఏకంగా లక్ష టన్నుల బియ్యాన్ని పాక్ ఎగుమతి చేయనుంది. దీనికి సంబంధించి పాక్ ట్రేడింగ్ కార్పొరేషన్ (TCP) కూడా టెండర్‌ను జారీ చేసింది.  

Also Read: స్నేహమంటూనే చైనా మరో కుట్ర.. సరిహద్దుల్లో డ్రోన్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు

Pakistan Seeks To Buy 100,000 Tonnes Of Rice

ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నుల బియ్యాన్ని పాక్ ఎగుమతి చేసింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ ఏడాది  బంగ్లాదేశ్‌కు మరో 1,00,000 టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి పాక్ టెండర్ జారీ చేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడి ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారుడు మొహమ్మద్ యూనస్‌ భారత్‌ను రెచ్చగొట్టేందుకు ఏ అవకాశాన్ని కూడా వదలిపెట్టడం లేదు. పాకిస్థాన్, టర్కీ, కెనడా నుంచి వచ్చిన ప్రతినిధులకు అతడు గ్రేటర్ బంగ్లాదేశ్‌ మ్యాప్‌ను సమర్పించాడు. ఈ మ్యాప్‌లో భారత్‌లో ఉన్న భూభాగాలు కూడా బంగ్లాదేశ్‌లో కనిపించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. 

Also Read:  శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌..పెరిగిన స్పాట్‌ బుకింగ్స్‌

ఈ ఏడాది ఏప్రిల్‌లో యూనస్ తొలిసారి చైనాకు వెళ్లిన సంగతి తెలిసిందే. భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలు సముద్ర మార్గం తెగిపోయిందని.. ఈ ప్రాంతానికి బంగ్లాదేశ్‌ మాత్రమే సముద్ర ద్వారం అన్నారు. ఇక్కడ తమ ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని ఆయన చైనాను ఆహ్వానించారు. బంగ్లాదేశ్ ఆరోపణలను భారత తీవ్రంగా ఖండించింది. ఈశాన్య ప్రాంతం భారత్‌కు వ్యూహాత్మక కేంద్రమని.. బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్‌ కీలకమైన అనుసంధాన కేంద్రంగా పనిచేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ అన్నారు. 

Advertisment
తాజా కథనాలు