Pak- Afghan: ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ దాడి.. తొమ్మిది మంది పిల్లలతో సహా పది మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ లోని ఖోస్ట్ ప్రావిన్స్ శోక సంద్రంలో మునిగిపోయింది. అక్కడ పాక్ చేసిన దాడులు కారణంగా పది మంది చనిపోయారు. ఇందులో తొమ్మిది మంది పిల్లలే ఉన్నారు. అయితే పాక్ మాత్రం ఎప్పటిలానే ఈ దాడులను తాము చేయలేదని బుకాయిస్తోంది.

New Update
Afghan

అమాయకులైన చిన్న పిల్లలను పాక్ ఆర్మీ పొట్టన పెట్టుకుంది. ఆఫ్ఘానిస్తాన్ లోని ఖోస్ట్ప్రావిన్స్ పాక్ చేసిన దాడుల్లో ఒక నెల, పదహారు నెలల ఉన్న పిల్లలు మృతి చెందారు. దీంతో ఆ ప్రావిన్స్ మొత్తం దుఖ:సాగరంలో మునిగిపోయింది. నిన్న అర్థరాత్రి పాక్ సైన్యం ఖోస్ట్ప్రావిన్స్ పై విరుచుకుపడింది. వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది సభ్యులు మరణించారు. వారిలో తొమ్మిది మంది పిల్లలే కావడం గమనార్హం. నిద్రపోతున్న ప్రజలపై పాక్ వైమానిక దాడులు చేసింది. వీరిలో 16 నెలల మోహిబుల్లా, 3 ఏళ్ళ హోజాబుల్లా, 5 ఏళ్ళ షంసుల్లా, 7 ఏళ్ళ అసదుల్లా, 13 ఏళ్ళ దాదుల్లా, 11 ఏళ్ళ కుమార్తె పల్వాసా, 7 ఏళ్ళ కుమార్తె ఐసా ఉన్నారు. వీరితో పాటూ సమియుల్లా 3 సంవత్సరాల కుమార్తె అసియా, 1 నెలల కుమార్తె అలియా కూడా మరణించారు. ఈ పిల్లలతో పాటూ 35 ఏళ్ళ రజియా కూడా చనిపోయారు. వీరెవరూ ఉగ్రవాదులు కాదు. అయినా కూడా పార్ దాడులకు బలైపోయారు. ఆఫ్ఘాన్ ఆగ్నేయ భాగంలో ఖోస్ట్ప్రావిన్స్ లో గుర్జుజ్ ఒక జిల్లా. దీనికి తూర్పు, దక్షిణాల్లో పాకిస్తాన్ ఖైబర్ఫంఖ్తుఖ్వాప్రావిన్స్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇదంతా పర్వత, అడవులతో నిండి ఉంటుంది. గుర్బుజ్ జిల్లాతో సహా ఖోస్ట్ప్రావిన్స్ మొత్తం జనాభా సుమారు 648,000. ఇది సున్నీ ఇస్లాంను ఆచరించే 99 శాతం పష్టున్ జాతి సమూహాలకు నిలయం.

మేమేం చేయలేదు..పాక్బుకాయింపు..

అయితే పాకిస్తాన్ మాత్రం తాము ఈ దాడులు చేయలేని చెబుతోంది. తామెటువంటి వైమానిక దాడులకు పాల్పడలేదని పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్పారు. తాము ఎవరిపైన అయినా దాడి చేస్తే ప్రకటిస్తామని అన్నారు. మా దృష్టిలో, మంచి లేదా చెడు తాలిబాన్లు లేరని చెప్పారు. అయితే పాకిస్తాన్ తాము చేసిన పనిని ఒప్పుకోకపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకు ముందు భారత్ పై కూడా దాడులు చేసినప్పుడు కూడా ఆ దేశం ఇలాగే చెప్పింది. పైగా భారతే తమ దాడి చేస్తోందని ఇదే అహ్మద్ షరీఫ్ అన్నారు కూడా. ఇక లాస్ట్ రెండు నెలల్లో ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ మూడుసార్లు వైమానిక దాడులను చేసింది. వీటిల్లో 71 మంది పౌరులు చనిపోయారు. వీరందరూ అమాయకులైన ఆఫ్ఘాన్లు మాత్రమే. పాక్ సైన్యం ఇప్పటి వరకు, ఏ దాడులలోనూ ఏ ప్రధాన తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కమాండర్లను చంపలేదు. చివరి పాకిస్తాన్ సైనిక దాడిలో క్రికెట్ ఆటగాళ్ళు మరణించారు. ఈసారి, తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించారు. 

Also Read: Sindh: పాకిస్తాన్ లోని సింధ్ లో హిందూ జనాభా ఎంత? ఈ ప్రావిన్స్ ఎందుకు ముఖ్యమైనది?

Advertisment
తాజా కథనాలు