India: చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. అరుణాచల్ వివాదంలో మారని చైనా తీరు

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ భారతీయ మహిళని చైనాలోని షాంఘై విమానాశ్రయంలో నిర్బంధించిన ఘటన, ఆపై అరుణాచల్ తమ భూభాగమంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరానిదని పునరుద్ఘాటించింది.

New Update
china

అరుణాచల్ ప్రదేశ్‌(arunachal-pradesh)కు చెందిన ఓ భారతీయ మహిళ(indian-woman)ని చైనాలోని షాంఘై విమానాశ్రయం(Shanghai airport)లో నిర్బంధించిన ఘటన, ఆపై అరుణాచల్ తమ భూభాగమంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరానిదని పునరుద్ఘాటించింది. చైనా ఎంతగా తిరస్కరించినా ఈ వాస్తవం మారదని స్పష్టం చేసింది.

Also Read :  తల్లి చేసిన పాపానికి 6ఏళ్లు జైలులో పసిపాప.. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్

India Strong Counter To China

లండన్ నుంచి జపాన్‌కు వెళ్తున్న పెమా వాంగ్‌జోమ్ థోంగ్‌డోక్ అనే భారతీయ మహిళకు షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో నవంబర్ 21న చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్టులో ఆమె జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో, చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం తెలిపారు. అరుణాచల్ తమ భూభాగమని, ఆమె ఇండియన్ పాస్‌పోర్ట్ చెల్లదని, ఆమె చైనా పౌరసత్వం తీసుకోవాలని హేళన చేశారని సదరు మహిళ ఆరోపించారు. ఆమెను దాదాపు 18 గంటల పాటు నిర్బంధించి, కనీస సదుపాయాలు కల్పించలేదని తెలిపారు. చివరికి షాంఘైలోని భారత కాన్సులేట్ జోక్యంతో ఆమె అక్కడి నుంచి బయటపడ్డారు.

ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ, అరుణాచల్ ప్రదేశ్ (చైనా దీనిని 'జాంగ్నాన్' అని అంటుంది) తమ భూభాగమేనని పాత వాదనను మళ్లీ వినిపించారు. తమ అధికారులు చట్టాలు, నిబంధనల ప్రకారమే వ్యవహరించారని, మహిళను నిర్బంధించడం లేదా వేధించడం జరగలేదని ఆమె ఆరోపణలను ఖండించారు. చైనా చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరానిది. ఇది స్పష్టమైన వాస్తవం. చైనా ఎంతగా తిరస్కరించినా ఈ వివాదరహిత వాస్తవం మారదు" అని గట్టిగా బదులిచ్చారు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఉన్నా భారత పౌరురాలిని ఏకపక్షంగా నిర్బంధించడం అంతర్జాతీయ విమానయాన నిబంధనలను, చైనా సొంత వీసా-రహిత రవాణా నియమాలను కూడా ఉల్లంఘించడమేనని భారత్ పేర్కొంది. ఈ విషయంలో ఢిల్లీ, బీజింగ్‌లలోని చైనా అధికారులకు భారత ప్రభుత్వం బలమైన దౌత్యపరమైన నిరసనను తెలియజేసింది.

Also Read :  తెలుగువారికి గుడ్‌న్యూస్.. డిజిటల్‌‌గా తెలుగు భాషలో రాజ్యాంగం రిలీజ్

Advertisment
తాజా కథనాలు