H1-B Visa: హెచ్ 1 బీ వీసాలపై వెనక్కు తగ్గిన ట్రంప్..గోల్డ్ కార్డ్ ధరలోనూ ఛేంజెస్..

హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య తన స్వరం మార్చారు. విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అన్నారు. అయితే దేశీయ రంగంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీల్లో మాత్రమే హెచ్ 1 బీ ఉద్యోగులను హైర్ చేసుకోవచ్చని చెప్పారు.

New Update
H1B and Green Card visa rules

హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ వైఖరిని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. మేక్ ఇన్ అమెరికాకు ఇంపార్టెన్స్ ఇస్తూనే విదేశీ ఉద్యోగాలను తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పింది. అమెరికన్ల ఉద్యోగాలను భద్రత కల్పించాలని ట్రంప్ భావిస్తున్నారని వైట్ హౌస్ తెలిపారు. ఇందులో భాగంగానే హెచ్ 1బీ వీసా విధానాలపై సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హెచ్-1బీ వీసా విధానంపై స్పష్టమైన, మధ్యే మార్గ వైఖరిని డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శించారు. అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూనే.. తయారీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలకు కొంత కాలం పాటు హెచ్-1బీ వీసాల మీద విదేశీ ఉద్యోగులను తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఇది చాలా మందికి ఉపయోగపడనుంది.

కొంత కాలం వరకూ ఓకే..

హెచ్ 1 బీ వీసాలపై అధ్యక్షుడు ట్రంప్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తున్నారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్లీవిట్ అన్నారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్ధానంలో విదేశీ ఉద్యోగులను నియమించడానికి ఆయన ఎప్పటికీ ఒప్పుకోరని అన్నారు. అలాగే అమెరికన్ తయారీ రంగాన్ని గతంలో కంటేమెరుగ్గా చేయాలని ట్రంప్కోరుకుంటున్నారనికరోలిన్లీవిట్ తెలిపారు. అమెరికాలో ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలు.. బ్యాటరీల వంటి అధునాతన ఉత్పత్తులను తయారుచేయడానికి ప్లాంట్లను ఏర్పాటు చేసేటప్పుడు.. మొదట్లో వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి తాత్కాలికంగా విదేశీ కార్మికులను తీసుకురావడానికి అధ్యక్షుడు ఒప్పుకున్నారని చెప్పారు. అయితే కంపెనీలో ఉత్పత్తి ప్రారంభం అయ్యాక మాత్రం అమెరికన్లకే ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పారు. అమెరికాలో వ్యాపారం చేయాలంటే కంపెనీలు ఇక్కడి వారినే ఉపయోగించుకోవాలని నియమంపై కట్టుబడి ఉన్నామని తెలిపారు.

గోల్డ్ కార్డ్ కూడా తగ్గింది..

అలాగే మరోవైపుట్రంప్ ప్రవేశ పెట్టిన గోల్డ్ కార్డ్ విషయంలోనూ మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు 5 మిలియన్ డాలర్లుగా ఉన్న గోల్డ్ కార్డ్ ధరను ఇప్పుడు తగ్గించారు. దీని ధరను ఇప్పుడు మూడు డాలర్లకు పరిమితం చేశారు. అలాగే ఇందులో క్యాటగిరీలను కూడా ప్రవేశపెట్టారు. ఇండివిడ్యువల్ గా గోల్డ్ కార్డ్ అప్లే చేసుకునే వారు కేవలం 1 మిలియన్ డాలర్లు చెల్లిస్తే చాలని..అదే కంపెనీల ద్వారా అప్లై చేసుకుంటే 2 మిలియన్లు చెల్లించాలని తెలిపారు. ఈ గోల్డ్ కార్డ్ వీసా కోసం అప్లే చేసుకునే వారు కచ్చితంగా I-140 కలిగి ఉండాలని చెబుతున్నారు. I-140 అనేది గ్రీన్ కార్డ్ కు ఎలిజిబిలిటీ ఇచ్చేది. ఇది ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డ్ క్యూలో ఉంటారు. వారికి అమెరికాలో ఎన్నాళ్ళు అయినా ఉండడానికి పర్మిషన్ ఉంటుంది. ఇలాంటి వారు ఇప్పుడు గోల్డ్ కార్డ్ కూడా అప్లైచేసుకోవచ్చును.

Advertisment
తాజా కథనాలు