నదిలో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్
మలేషియాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ నదిలో కూలిపోయింది. జోహోర్ రాష్ట్రంలోని పులాయ్ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మాక్ డ్రిల్ సందర్భంగా జరిగినట్లు మలేషియా పౌరవిమానయాన శాఖ పేర్కొంది.