ఆక్రమణలో దూకుడు.. అభివృద్ధిలో వెనుకడుగు: అమెరికా ప్రయోగాలు విఫలమేనా?

దేశాల్ని ఆక్రమించడంలో ఉన్నంత ఉత్సాహం, వాటిని అభివృద్ధి పథంలో నడిపించడంలో లేదని అమెరికా చరిత్ర చెబుతోంది. గతంలో అఫ్గానిస్థాన్, ఇరాక్‌లలో US చేసిన ప్రయోగాలు ఫెయిల్ అవ్వడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు వెనిజులాలోనూ అదే రిపీట్ అవుతుందానే అనుమానాలు వస్తున్నాయి.

New Update
america

దేశాలను ఆక్రమించడంలో ఉన్నంత ఉత్సాహం, ఆ దేశాలను అభివృద్ధి పథంలో నడిపించడంలో అమెరికాకు లేదని చరిత్ర చెబుతోంది. గతంలో అఫ్గానిస్థాన్, ఇరాక్‌లలో US చేసిన ప్రయోగాలు ఫెయిల్ అవ్వడమే ఇందుకు ఎగ్జామ్‌పుల్.  ఏ దేశమైనా తమకు వ్యతిరేకంగా మారుతోందని భావిస్తే, అక్కడ దాడులు చేయడం, పాలకులను గద్దె దించి తమకు అనుకూలమైన వారిని కూర్చోబెట్టడం అమెరికాకు దశాబ్దాలుగా అలవాటుగా మారింది. ఇప్పుడు వెనెజువెలాలోనూ అదే రిపీట్ అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అగ్రరాజ్యం అని పెత్తనం చెలాయించడమే తప్పా.. ఆయా దేశాల్లో అమెరికా ఏమాత్రం డెవలప్‌మెంట్ చేయట్లేదనేది వాస్తవం.. 

అఫ్గానిస్థాన్: రెండు దశాబ్దాల వైఫల్యం

2001లో అఫ్గానిస్థాన్‌పై దాడి చేసిన అమెరికా బలగాలు తాలిబన్లను తరిమికొట్టి కాబుల్‌ను ఆక్రమించాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామని అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రకటించారు. అమెరికా మద్దతుతో హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ, అవినీతి, బంధుప్రీతి కారణంగా ఆ పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఫలితంగా తాలిబన్లు మళ్ళీ పుంజుకున్నారు. చివరికి రెండు దశాబ్దాల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, అధికారాన్ని తిరిగి తాలిబన్లకే అప్పగించి చేతులు దులుపుకొంది. నేడు అఫ్గాన్ ప్రజలు గతంలో కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఇరాక్: అంతం లేని కల్లోలం

2003లో సద్దాం హుసేన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇరాక్‌పై అమెరికా దండెత్తింది. అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆక్రమణ తర్వాత ఏర్పడిన కొన్నిరోజులకే అక్కడ మత వర్గాల మధ్య ఘర్షణలు, ఇస్లామిక్ స్టేట్ (ISIS) వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. అమెరికా వైదొలిగినా ఇరాక్ నేటికీ అస్థిరత, హింసతో కొట్టుమిట్టాడుతూనే ఉంది.

వెనిజులాలో అదే పరిస్థితా..?

ప్రస్తుతం వెనిజులాలోనూ అమెరికా అదే ఆట మొదలుపెట్టింది. ఇటీవల ఆ దేశంపై మెరుపు దాడులు చేసి అధ్యక్షుడిని బందీగా పట్టుకోవడం వ్యూహాత్మకంగా ట్రంప్‌కు విజయం కావచ్చు. ఒక్క అమెరికా సైనికుడూ మరణించకుండా ఈ ఆపరేషన్ ముగియడం ఆయన రాజకీయ ప్రతిష్ఠను పెంచింది. కానీ, శాంతియుత అధ్యక్షుడిగా ఉంటానని, యుద్ధాలకు దూరంగా ఉంటానని వాగ్దానం చేసిన ట్రంప్.. ఇప్పుడు ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్, వెనెజువెలా వంటి బహుముఖ పోరాటాల్లో తలమునకలవుతున్నారు.

అఫ్గాన్, ఇరాక్ తరహాలోనే వెనెజువెలాను కూడా అమెరికా గాలికొదిలేస్తుందా? అక్కడి ప్రజల కష్టాలు మరింత పెరుగుతాయా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న. అభివృద్ధి కంటే ఆక్రమణకే ప్రాధాన్యమిచ్చే అమెరికా ధోరణి ఆ దేశాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు