బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి జుట్టు కట్ చేసి

బంగ్లాదేశ్‌లో అరాచకం హద్దులు దాటుతోంది. రక్షణ కల్పించాల్సిన చోటే రాక్షసత్వం రాజ్యమేలుతోంది. సోమవారం (జనవరి 5)న హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెని చిత్రహింసలకు గురిచేశారు.

New Update
Hindu widow

బంగ్లాదేశ్‌లో అరాచకం హద్దులు దాటుతోంది. రక్షణ కల్పించాల్సిన చోటే రాక్షసత్వం రాజ్యమేలుతోంది. సోమవారం (జనవరి 5)న హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెని చిత్రహింసలకు గురిచేశారు. ఆ తీరు సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేస్తోంది. ఈ దారుణ ఘటన గ్లాదేశ్‌లోని జెనైదా ఉప జిల్లా కాలిగంజ్‌లో చోటుచేసుకుంది. 40 ఏళ్ల హిందూ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు నరికివేశారు. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇద్దరు దుండగులు ఆమెపై దాడి చేశారు. నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, ఆమెను దారుణంగా కొట్టి, ఒక చెట్టుకు కట్టేసి తీవ్రంగా అవమానించారు.

బాధితురాలిని సామాజికంగా, మానసికగా కుంగదీసేలా ఆమె జుట్టును కత్తిరించి వికృతంగా ప్రవర్తించారు. కేవలం మైనారిటీ మతానికి చెందిన మహిళ కావడమే ఆమె చేసిన పాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం హిందూ మైనారిటీలకు శాపంగా మారింది.

దేశవ్యాప్తంగా హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. విద్యావంతులైన హిందూ మహిళలను బలవంతంగా పదవుల నుంచి తప్పించడం, సోషల్ మీడియాలో వేధించడం పెరిగిపోయింది. ఇప్పుడు సాక్షాత్తూ అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన

ఈ ఘటనపై భారత్ సహా పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల రక్షణ విషయంలో విఫలమవుతోందని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించిన సంగతి తెలిసింది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించబడకపోతే, మైనారిటీల ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.

Advertisment
తాజా కథనాలు