/rtv/media/media_files/2026/01/05/trump-plan-2026-01-05-19-11-40.jpg)
Trump plan
వెనుజులా అధ్యక్షుడు మదురోను బంధించిన తర్వాత ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అన్న చర్చ అంతర్జాతీయంగా జోరుగా సాగుతోంది. క్యూబా, కొలంబియా, మెక్సికో, ఇరాన్, గ్రీన్ లాండ్ పై అమెరికా దాడులకు సిద్ధం అవుతుందని తెలుస్తోంది. ఈ దేశాలను అమెరికా తన టార్గెట్‌గా ఎందుకు ఎంచుకుందంటే..
1. క్యూబా (Cuba):
వెనుజులా తర్వాత అమెరికా తదుపరి గురి క్యూబాపైనే ఉండే అవకాశం ఉంది.
ఆర్థిక సంక్షోభం: వెనుజులా నుండి అందుతున్న ఉచిత చమురు, ఆర్థిక సాయం నిలిచిపోవడంతో క్యూబా ఆర్థికంగా కుప్పకూలింది. "క్యూబా ఓ ఫెయిల్యూర్ కంట్రీ" అని ట్రంప్ ఇటీవల అన్నాడు.
మదురోకు మద్దతు: మదురో వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఇంటెలిజెన్స్ విభాగంలో క్యూబా దళాలు కీలక పాత్ర పోషించాయి. మదురో పతనం తర్వాత, ఆ 'నెట్‌వర్క్'ను పూర్తిగా తొలగించాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని టార్గెట్ చేయాలని ప్లాన్ వేస్తోంది.
క్యూబన్-అమెరికన్ల ఓట్లు: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న క్యూబన్-అమెరికన్ల ఓట్లు, మద్దతు కోసం క్యూబాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ట్రంప్ వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు.
2. కొలంబియా (Colombia):
దశాబ్దాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న కొలంబియా, ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది.
డ్రగ్స్ నియంత్రణలో వైఫల్యం: కొలంబియాలో భారీగా కోకైన్ ఉత్పత్తి అవుతోందని, అది అమెరికా యువతను నాశనం చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను "డ్రగ్స్ వ్యాపారి"గా ఆయన విమర్శించారు.
భావజాలంలో డిఫరెన్స్: పెట్రో ఒక వామపక్ష నాయకుడు కావడం, వెనుజులాపై అమెరికా దాడిని ఖండించడం వల్ల అమెరికాకు ఆయనపై నమ్మకం పోయింది. అవసరమైతే కొలంబియాలోని డ్రగ్ మిల్లులపై నేరుగా సైనిక దాడులు చేస్తామని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది.
3. మెక్సికో (Mexico):
మెక్సికో సరిహద్దులో పెరుగుతున్న అక్రమ వలసలు, 'ఫెంటానిల్' (Fentanyl) డ్రగ్ సరఫరా ప్రధాన కారణాలు.
కార్టెల్స్ నియంత్రణ: మెక్సికో ప్రభుత్వం డ్రగ్ మాఫియా (Cartels) చేతుల్లో బందీ అయిందని, వారు అమెరికాపై "అప్రకటిత యుద్ధం" చేస్తున్నారని ట్రంప్ భావిస్తున్నారు.
సైనిక జోక్యం: మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బామ్ ఒప్పుకున్నా లేకపోయినా, అమెరికా తన రక్షణ కోసం మెక్సికోలోకి చొరబడి కార్టెల్స్‌ను అంతం చేస్తామని ట్రంప్ సంకేతాలిచ్చారు.
చైనా వస్తువులు.. మెక్సికో ద్వారా చైనా వస్తువులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. మెక్సికోలో చైనా కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టడం ద్వారా అమెరికా మార్కెట్‌ను దక్కించుకోవాలని చూస్తున్నాయని అమెరికా భావిస్తోంది. మిత్రదేశంగా ఉంటూ శత్రువులకు (చైనాకు) చోటివ్వడం ఏంటని అమెరికా ఫైర్ అవుతోంది.
అక్రమ వలసలు: మెక్సికో తన దక్షిణ సరిహద్దును (గ్వాటెమాల వైపు) సరిగా కాపాడకపోవడం వల్లే ఇతర దేశాల వలసదారులు మెక్సికో మీదుగా అమెరికాకు వస్తున్నారని అమెరికా వాదన.
4. ఇరాన్ (Iran):
ఇరాన్‌లో జరుగుతున్న ప్రజా నిరసనలపై ప్రభుత్వం హింసాత్మకంగా స్పందిస్తే, అమెరికా కఠినంగా స్పందిస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
అణు సామర్థ్యం పెంచుకోవడం: 2025 జూన్‌లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భారీ దాడులు నిర్వహించాయి. ఇరాన్ మళ్ళీ తన అణు సామర్థ్యాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోందని అమెరికా అనుమానిస్తోంది. ఇరాన్ మళ్ళీ అణు ప్రయత్నాలు చేస్తే, మేము ఊరుకోం.. అని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ సాకుతో ఏ క్షణమైనా ఇరాన్ పై ట్రంప్ దాడి చేసే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఆయుధాలు: ఇరాన్ తన ఆయుధాలను క్రిప్టోకరెన్సీల ద్వారా విక్రయిస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల అమెరికా డాలర్ ఆధిపత్యం దెబ్బతింటుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
ఆయిల్ నిల్వలు: ఇరాన్ దగ్గర భారీగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. వీటిని దక్కించుకోవడానికి ట్రంప్ కుట్ర చేస్తున్నాడన్న చర్చ కూడా ఉంది.
5. గ్రీన్‌లాండ్ (Greenland):
రష్యా-చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి గ్రీన్ లాండ్ పై దాడులు చేయడం అవసరమని అమెరికా భావిస్తోంది.
భద్రత: గ్రీన్‌లాండ్ భద్రతను డెన్మార్క్ సరిగా పర్యవేక్షించడం లేదని, అక్కడ ఇతర దేశాల నౌకలు (రష్యా సబ్‌మెరైన్లు) సులభంగా తిరుగుతున్నాయని అమెరికా అసహనం వ్యక్తం చేస్తోంది. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్‌లాండ్ వ్యూహాత్మకమైన ప్రాంతం. అందుకే డెన్మార్క్ నుండి దీనిని విడదీసి తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. గ్రీన్‌లాండ్‌లో విమానాశ్రయాల నిర్మాణం, మైనింగ్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా అక్కడ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. చైనాను అడ్డుకోవడంలో డెన్మార్క్ మెతక వైఖరి అవలంబిస్తోందని ట్రంప్ కోపంతో ఉన్నారు.
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్: గ్రీన్‌లాండ్ మంచు కింద విలువైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (Rare Earth Elements) ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, అత్యాధునిక ఆయుధాల తయారీకి ఈ ఖనిజాలు అవసరం. ప్రస్తుతం వీటి కోసం అమెరికా చైనాపై ఆధారపడుతోంది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకుంటే చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అగ్రరాజ్యం స్కెచ్ వేస్తోంది.
Follow Us