Japan: వామ్మో.. రూ.29 కోట్ల ధర పలికిన చేప

సముద్రంలో దొరికే అరుదైన చేపలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో చేప వేలు, లక్షల్లో అమ్ముడుపోతుంది. జపాన్ రాజధాని టోక్యోలో మాత్రం ఓ చేప రికార్డు ధర పలికింది. ఓ చేప ఏకంగా 3.24 మిలియన్ డాలర్లకు (మన కరెన్సీలో రూ.29 కోట్లు) అమ్ముడుపోయింది.

New Update
The world’s most expensive Bluefin tuna sells for a record $3.2 million in japan

The world’s most expensive Bluefin tuna sells for a record $3.2 million in japan

సముద్రంలో దొరికే అరుదైన చేపలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో చేప వేలు, లక్షల్లో అమ్ముడుపోతుంది. జపాన్ రాజధాని టోక్యోలో మాత్రం ఓ చేప రికార్డు ధర పలికింది. ఓ చేప ఏకంగా 3.24 మిలియన్ డాలర్లకు (మన కరెన్సీలో రూ.29 కోట్లు) అమ్ముడుపోయింది. సోమవారం టోక్యోలోని తొయోసు చేపల మార్కెట్‌కు 243 కిలోలు ఉన్న బ్లూఫిన్ ట్యూనా చేప(Tuna Fish) ను తీసుకొచ్చారు. దీనికి వేలం పాట జరిగింది. కియోమురా సంస్థ అధ్యక్షుడు కియోషి కిమురా ఈ చేపను 3.24 మిలియన్ డాలర్లను దక్కించుకున్నారు. ఒక చేపకు అంత రేటు పలకడంతో అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. 

Also read: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి జుట్టు కట్ చేసి

భారీ స్థాయిలో ధర పలకడానికి కారణం 

కియోషి కిమురా.. సుషి జాన్‌మై పేరిట గొలుసుకట్టు సుషి రెస్టారెంట్‌లను నిర్వహిస్తున్నారు. వేలంలో చేపకు భారీ ధర చెల్లిస్తే వాళ్ల కంపెనీ బ్రాండ్‌ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. అందుకే దీన్ని ప్రచార అస్త్రంగా వాడుకుని వేలంలో భారీ ధరలు చెల్లిస్తారు. అంతేకాదు జపాన్‌ సంప్రదాయం ప్రకారం ఏడాదిలో మొదటి వేలంలో సొంతం చేసుకున్న ఈ చేప అదృష్టం తెస్తుందని అక్కడివారు నమ్ముతారు. 

Also Read: ఇరాన్‌లో హై టెన్షన్.. భారతీయులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక

ఆ దేశంలో ఓమా తీరంలో ఈ ట్యూనా చేపలు దొరుకుతుంటాయి. ప్రపంచంలోనే ఈ చేపలను అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. అక్కడి చల్లని నీటి వల్ల చేపల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండి.. రుచి అద్భుతంగా ఉంటుంది. ఇవి 200 నుండి 300 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇంత భారీ ధరతో చేపను కొన్నప్పటికీ రెస్టారెంట్ యజమానులు తమ కస్టమర్లకు ఈ చేప ముక్కలను సాధారణ ధరలకే అందిస్తారు. కానీ ఇది వాళ్ల కంపెనీ వ్యాపారానికి మాత్రం గొప్ప ప్రచారంగా మారుతుంది. 

Advertisment
తాజా కథనాలు