Trump: గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన ట్రంప్‌.. అసలు ప్లాన్ ఇదే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. గ్రీన్‌లాండ్‌ విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఈ ఐలాండ్ విషయంలో మరింత దూకుడు పెంచుతున్నారు. ట్రంప్‌కు గ్రీన్‌లాండ్‌పై ఎందుకు కన్ను పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
'We need Greenland', Trump repeats threat to annex Danish territory

'We need Greenland', Trump repeats threat to annex Danish territory

వెనెజువెలా అధ్యక్షుడు మదురో(Nicolas Maduro) ను అమెరికా నిర్బంధించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(trump venezuela war).. గ్రీన్‌లాండ్‌ విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ కీలకమంటూ మాట్లాడారు. గతంలో కూడా ట్రంప్‌ దీని గురించి ప్రస్తావించారు. ఆయన మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు గ్రీన్‌లాండ్ అమ్మకానికి ట్రంప్ ప్రతిపాదన చేయగా డెనార్మ్‌ దీన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఈ ఐలాండ్ విషయంలో మరింత దూకుడు పెంచుతున్నారు. ట్రంప్‌కు గ్రీన్‌లాండ్‌పై ఎందుకు కన్ను పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.  

గ్రీన్‌లాండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. అక్కడ జనాభా కేవలం 57 వేలు మాత్రమే. 80 శాతం భూమి మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతం డెన్మార్క్‌లో భాగమైనప్పటికీ అమెరికాకు దగ్గరగా ఉంటుంది. 1979లో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి హోదా వచ్చింది. ఇక్కడి విదేశీ వ్యహారాలు, రక్షణ అంశాలు డెన్మార్క్‌ చేతుల్లోనే ఉంటాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, యూరప్ యూనియన్‌కు మధ్యలో ఈ ద్వీపం ఉంటుంది. అందుకే ట్రంప్ ఈ ప్రాంతం తమకు ఎంతో కీలకమని అంటుంటారు. 

Also Read: ఇరాన్‌లో హై టెన్షన్.. భారతీయులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక

గ్రీన్‌లాండ్‌ ఎప్పటినుంచో రక్షణ అవసరాల కోసం అమెరికాకు సపోర్ట్ చేస్తోంది. 1950ల్లోనే డెన్మార్క్‌, అమెరికా మధ్య సైనికపరమైన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా.. గ్రీన్‌లాండ్‌లోని చాలావరకు సైనిక స్థావరాలు ఏర్పాటు చేసింది. అనంతరం అందులో చాలావాటిని మూసేసింది. మళ్లీ కొత్త వాటిని అమెరికా నిర్మించుకుంటా అంటే డెన్మార్క్ రిజెక్ట్ చేసే ఛాన్స్‌లు లేవు. దీనికి కారణం అమెరికా, డెన్మార్క్‌ నాటోలోని సభ్యదేశాలే. ఇరు దేశాల మధ్య సన్నిహత సంబంధాలు ఉన్నాయి. 

కానీ గ్రీన్‌లాండ్‌ను తాము స్వాధీనం చేసుకుంటామని ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలు మాత్రం కేవలం ఇది రక్షణ అవసరాల కోసం కాదని అర్థమవుతోంది. గతంలో కూడా అమెరికా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి 1946లో 100 మిలియన్ డాలర్ల విలువైన బంగాన్ని ఇస్తామంటూ డెన్మార్క్‌కు ప్రతిపాదన పంపింది. కానీ డెన్మార్క్‌ దీన్ని తిరస్కరించింది. 

ఖనిజాల కోసమేనా 

ఇటీవల అమెరికా వెనెజులవెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వల్లే ఆయన్ని అమెరికాకు తీసుకొచ్చామని ట్రంప్ చెబుతున్నారు. వాస్తవానికి సౌత్ అమెరికా, కరీబియన్ దీవుల్లో కూడా వెనెజువెలా కన్నా ఎక్కువగా భారీ స్థాయిలో డ్రగ్స్‌ రవాణా చేసే దేశాలు దేశాలున్నాయి. కానీ వెనెజువెలాను మాత్రమే ట్రంప్‌ టార్గెట్ చేశాడు. దీనికి కారణం అక్కడున్న చమురు నిక్షేపాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. 

Also read: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి జుట్టు కట్ చేసి

అందుకే గ్రీన్‌లాండ్ విషయంలో కూడా అదే జరగనుందా అనే సందేహాలు నెలకొంటున్నాయి. అక్కడ దొరికే అరుదైన ఖనిజాల కోసమే ట్రంప్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. బంగారం, నికెల్, కోబాల్ట్ నిక్షేపాలతో పాటు ఇతర అరుదైన ఖనిజాలు గ్రీన్‌లాండ్‌లో భారీ స్థాయిలో ఉన్నాయి. అమెరికాకు చెందిన మైనింగ్ కంపెనీలు గ్రీన్‌లాండ్‌ కన్నేసినట్లు తెలుస్తోంది. 

అమెరికాకు పోటీగా చైనా 

మరోవైపు అమెరికాకు అన్ని రంగాల్లో పోటీగా వస్తున్న చైనా కూడా గ్రీన్‌లాండ్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్‌ చేస్తోంది. ఈ రంగంలో దాదాపు 11 శాతం చైనాకు వాటా ఉంది. కేవలం గనులకు మాత్రమే పరిమితం కాకుండా ఆర్కిటిక్ ప్రాంతంలోని కొత్త సముద్ర మార్గాల అన్వేషణలో కూడా చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. భూ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆర్కిటిక్‌ మంచు కరుగుతోంది. దీంతో కొత్త మార్గాలు ఏర్పాటవుతున్నాయి. అందుకే చైనా కూడా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. 2018లో చైనా తమ ఆర్కిటిక్ విధానాన్ని కూడా ప్రకటించింది. కొత్త సముద్ర మార్గాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. అందుకే గ్రీన్‌లాండ్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే చెనా, రష్యాకు చెక్‌ పెట్టొచ్చని ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు