/rtv/media/media_files/2026/01/05/us-is-taking-control-of-venezuela-oil-reserves-2026-01-05-12-30-53.jpg)
Trump says US is taking control of Venezuela’s oil reserves
వెనెజువెలా(Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ చమురు రంగం కూడా అమెరికా కంట్రోల్‌లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ప్రకటించారు. దీంతో భారత చమురు రంగానికి ఎలాంటి ప్రభావం ఉంటుందో అనేదానిపై చాలామందికి సందేహం నెలకొంది. అయితే ఈ పరిణామాల వల్ల మనదేశ చమురు కంపెనీలకు లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే భారీమొత్తంలో బకాయిలు వసూలవుతాయని అంచనా వేస్తున్నారు.
వెనెజువెలా(Venezuela’s Oil Reserves) చమురు రంగాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటే మన భారత్‌కు రావాల్సిన 1 బిలియన్ డాలర్ల (రూ.9 వేల కోట్లు) బకాయిలు అందే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మన కంపెనీలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి ముడిచమురు ఉత్పత్తిని పెంచే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో భారత్‌కు వెనెజువెలా అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉండేది. రోజుకు ఏకంగా 4 లక్షల బ్యారెళ్లకు పైగా చమురును అక్కడి నుంచి దిగుమతి చేసుకునేది. 2020లో వెనెజువెలాపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత్ అక్కడి నుంచి చమురు కొనుగోళ్లను ఆపేసింది.
Also Read : POKను భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ONGC విదేశ్
భారత్(india) కు చెందిన ONGC విదేశ్ కంపెనీ తూర్పు వెనెజువెలాలోని శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రాన్ని నిర్వహిస్తోంది. కానీ అమెరికా ఆంక్షలతో ఇక్కడ చమురు ఉత్పత్తి చాలావరకు తగ్గిపోయింది. వాస్తవానికి అక్కడ భారీగా నిల్వలున్నాయి. కానీ ఇప్పుడవి మనకు ఉపయోగపడటం లేదు. ఈ చమురు క్షేత్రంలో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 40 శాతం వాటా ఉంది. ఈ కంపెనీకి 2014 వరకు 536 మిలియన్ డాలర్లు( మన కరెన్సీలో దాదాపు రూ.4800 కోట్ల) డివిడెండ్లను ఇవ్వడంలో వెనెజువెలా ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత ఇదే మొత్తాన్ని చెల్లించేందుకు కావాల్సిన ఆడిట్‌లకు పర్మిషన్ రాకపోవడంతో క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ నిలిచిపోయింది.
వెనెజువెలాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే గుజరాత్‌లోని మాతృసంస్థ ONGC చమురు క్షేత్రాల నుంచి రిగ్‌లు, ఇతర పరికరాలను శాన్ క్రిస్టోబల్‌కు ONGC విదేశ్‌కు తరలించవచ్చు. దీని ఫలితంగా ఒక్కరోజుకు 5--000 నుంచి 10000 బ్యారెళ్లకు పడిపోయింది. దీంతో చమురు ఉత్పత్తిని 10 రేట్ల వరకు పునరుద్ధరించవచ్చని అధికారులు అంటున్నారు.
ఎగుమతులు మళ్లీ షురూ
అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే వెనెజువెలా నుంచి ప్రపంచ దేశాలుకు మళ్లీ చమురు ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. శాన్‌క్రిస్టోబల్ నుంచి 1 బిలియన్ డాలర్లు బకాయిలను సైతం ONGC విదేశ్ వసూలు చేసుకోగలదు. చెవ్రాన్ చముకు క్షేత్రాని నిర్వహించి, చమురు ఎగుమతి చేసేందుకు ఆఫీస్ ఆఫ్ ది ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) ఇచ్చిన పర్మిషన్ల లాగే ప్రత్యేక లైసెన్స్ ఆంక్షల మినహాయింపులను ONGC విదేశ్ కోరుతుంది.
వెనెజువెలాలో ఉన్న మరిన్ని చమురు క్షేత్రాలను ONGC విదేశ్, ఇతర భారత సంస్థలు తీసుకోని.. కారాబోబో 1 ప్రాంతం నుంచి ప్రొడక్షన్‌ను మళ్లీ ప్రారంభించవచ్చు. కారాబాబో1లో చూసుకుంటే ONGCకి 11 శాతం వాటా ఉంది. అలాగే IOCకి 3.5 శాతం, ఆయిల్ ఇండియాకు కూడా 3.5 శాతం చొప్పున షేర్లు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ వాటాదారుగా వెజెజువెలాకు చెందిన ప్రభుత్వ ఆయిల్ కంపెనీ పెట్రోలియోస్ డి వెనెజువెలా ఎస్‌ఏ (PDVSA) ఉంది.
Also Read : NRI Woman: దారుణం.. అమెరికాలో NRI యువతి హత్య
భారత్‌పై ప్రభావం ఉండదు
అమెరికా-వెనెజువెలా మధ్య పరిణామాల ప్రభావం భారత్ వాణిజ్యంపై అంతగా ఉండదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ వెల్లడించింది. ఆంక్షల తర్వాత వెనెజువెలాతో భారత వాణిజ్యం భారీగా తగ్గిపోయింది. 2024-25లో ముడిచమురు దిగుమతులు 81.3 శాతానికి పడిపోయాయి. ఇదే సమయంలో వెనెజువెలా నుంచి దిగుమతులు 364.5 మిలియన్ డాలర్లు (రూ.3280 కోట్లు) మాత్రమే. ఈ సమయంలోనే మన ఎగుమతులు 95.3 మిలియన్ డాలర్లు (రూ.850 కోట్లు)గా ఉంది. అయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అంతగా ఉండదని నిపుణలు చెబుతున్నారు.
వెనెజువెలాలో కేవలం చమురుకు మాత్రమే కాకుండా మెటల్స్, ఫార్మా లాంటి రంగాల్లో కూడా భారతీయ కంపెనీలు చాలావరకు పెట్టుబడులు పెట్టాయి. అక్కడ లోహ నిల్వలు కూడా ఎక్కువగా నే ఉన్నాయి. వెనెజువెలాలోని అతిపెద్ద ఐరన్‌ఓర్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతలను స్వీకరించడం వల్ల జిందాల్ గ్రూప్ అక్కడ తమ వ్యాపారాన్ని పెంచుకుంది. కరాకస్‌లో ఇంజనీర్స్ ఇండియా తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాంకేతిక సహకారానికి దోహదపడుతోంది.
వెనెజువెలా ఆరోగ్య రంగంలో భారతీయ ఔషధ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సన్‌ఫార్మా, గ్యెన్‌మార్క్ లాంటి కంపెనీలు అక్కడ సొంతంగా యూనిట్లను ఏర్పాటు చేశాయి. మందులను ఉత్పత్తి కూడా చేస్తున్నాయి. సిప్లా అనే కంపెనీ తమ ఎగుమతులతో అక్కడి రోగులకు అవసరమైన ప్రాణరక్షణ మందులను అందుబాటులో ఉంచుతోంది. గతంలో అక్కడ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు కూడా పట్టు ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల 2024లో తన వాటాలను విక్రయించి బయటికి వచ్చేసింది.
Follow Us