ఇంటర్నేషనల్ అవన్నీ పిరికి ప్రయత్నాలు.. మనల్ని బలహీనపరచలేవు: కెనడా ఇష్యూపై మోదీ! కెనడాలో హిందూ భక్తులు, దేవాలయంపై జరిగిన దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. 'మన దౌత్యవేత్తలను బెదిరించేందుకే ఈ పిరికి ప్రయత్నాలు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాలను ఎప్పటికీ బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయంవైపే ఉంటుందని ఆశిస్తున్నా' అన్నారు. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడులు.. స్పందించిన ట్రూడో కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. అక్కడి ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కులను కాపాడతామని తెలిపారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: కమలా హారిస్‌కు బిగ్ షాక్.. స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ హవా పోలింగ్‌కు కొన్ని గంటల ముందు స్వింగ్ స్టేట్స్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా ట్రంప్‌నకు 48 శాతం అనుకూలంగా ఉన్నారని తాజాగా అట్లాస్ ఇంటెల్ పోల్స్ తెలిపింది. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India: అంతర్జాతీయ మధ్యవర్తిగా ఉద్భవిస్తున్న భారత్. ఇవే ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. బ్రిక్స్ దేశాలతో పాటు జీ7 దేశాలతో సంబధాలను సమతుల్యం చేయడంలో అంతర్జాయ మధ్యవర్తిగా భారతదేశ పాత్ర ప్రపంచానికి చాటిచెప్పుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో కమలా హారిస్ ముందంజ అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోయే అవకాశం ఉందని తాజాగా ఓ సర్వే అంచనా వేసింది. గతంలో ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వే చెప్పింది. ఇప్పుడు అక్కడ ట్రంప్ 44 శాతం మద్దతుతో ఉండగా.. కమలా హారిస్ 47 శాతంతో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దారుణం.. 29 మంది చిన్నారులకు ఉరి శిక్ష!.. ఆకలి ఎంతపని చేసింది! నైజీరియాలో దారుణం జరిగింది. ఆకలికి తాళలేక రోడ్డెక్కి నిరసనలు చేసిన 76 మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు. ఆపై కోర్టు వారికి మరణశిక్షను విధించింది. అందులో 29 మంది చిన్నారులు ఉండటం సంచలనం రేపుతోంది. By Seetha Ram 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ WhatsApp: 85 లక్షల వాట్సప్ అకౌంట్స్ బ్లాక్! ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. By V.J Reddy 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ పనులు చేసి చూపిస్తా : ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోలో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలను వెనక్కి తెచ్చి కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో రేపే ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇరాక్ భూభాగంపై భారీగా యుద్ధ సామగ్రిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn