Russia's poseidon: నగరాలను మింగేసే ఆయుధం..రష్యా చేతిలో జలరాక్షసి పోసిడాన్

రష్యా తన బలాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సైనిక శక్తిగా మారింది. దాంతో పాటూ ఇప్పుడు కొత్త కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. తాజాగా అణ్వాయుధ శక్తితో కూడిన జలాంతర్గామి కూడా చేరింది.

New Update
poseidon

రష్యా అధ్యక్షుడు పుతిన్ రోజురోజుకూ కొరకరాని కొయ్యలా తయారవుతున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. పుతిన్ ఆధ్వర్యంలో ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న రష్యా బలం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు ఆ దేశం సైన్యంలో ఇప్పుడొక సముద్ర రాక్షసి కూడా యాడ్ అయింది. ఇది ఒక బటన్ నొక్కితే చాలు మొత్తం ఖండాలను మ్యాప్ నుండి తుడిచిపెట్టేస్తుంది. సముద్రంలో సునామీని తెచ్చి పెట్టగలదు. దాని పేరే పోసిడాన్.

జలరాక్షసి..పోసిడాన్..

ఈ పోసిడాన్ ను రష్యా గత ఏడాది అక్టోబర్ లో పరీక్షించింది. నీటి అడుగున అణు జలాంతర్గామి డ్రోన్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.ఇలాంటి ఆయుధం ఎవరి దగ్గరా లేదని, దానిని ఆపడానికి ఎవరూ సాంకేతికతను అభివృద్ధి చేయలేరు అని పుతిన్ స్వయంగా ప్రకటించారు.  ఇది రష్యా బ్రహ్మాస్త్రమని చెప్పారు. ఈ పోసిడాన్ సముద్రంలో రేడియో ధార్మిక సునామీని విడుదల చేయగలదు. దాని వలన అనేక నగరాలు నిమిషాల్లో నాశనం అయిపోతాయి.  ఈ పోసిడాన్ అణుశక్తితో, జలాంతర్గామిలా నడిచే ఒక డ్రోన్. సముద్రపు లోతుల్లో వేల మైళ్ళు ప్రయాణించగలదు. ఇది సముద్రం బయటా, లోపలా రెండు చోట్లా వినాశనాన్ని సృష్టించగలదు. 

1600 అడుగుల ఎత్తులో రేడియోధార్మిక సునామీ

ఈ జలాంతర్గామితో కూడిన పోసిడాన్‌ను ఒక దేశ తీరానికి సమీపంలో పేల్చివేస్తే.. అది 1,650 అడుగుల ఎత్తు వరకు రేడియోధార్మిక సునామీని సృష్టిస్తుందని రష్యన్ వ్యూహకర్తలు చెబుతున్నారు. ఇది సృష్టించే అలలు నీటిని మాత్రమే కాకుండా విషపూరిత రేడియేషన్‌ను కూడా మోసుకెళ్తాయని, భవిష్యత్ తరాలకు కూడా ముప్పు కలిగిస్తాయని తెలిపారు. ప్రధాన నగరాలు ఒక్క దెబ్బతో సముద్రపు అడుగుభాగంలో శాశ్వతంగా సమాధి చేయబడతాయని చెబుతున్నారు. పోసిడాన్ టైటానియం మిశ్రమంతో తయారు చేయబడింది.  ఇది మానవులు చేరుకోలేని చోటుకు కూడా చేరుకోగలదు. దీని వేగం 100 నాట్లుగా ఉంటుంది. ప్రపంచంలోని ఏ టార్పెడో కంటే చాలా రెట్లు వేగంగా ఉంటుంది. ఈ డ్రోన్ నీటి అడుగున చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది. శ్రువుల కళ్ళు గప్పి..సోనార్లకు కూడా అందకుండా..వారు దానిని గుర్తించే లోపునేవారి నౌకాశ్రయం కింద పేలిపోతుంది. అలాగే ఈ ఆయుధాన్ని నీటిలోనే ఎన్ని రోజులైనా ఉంచేయవచ్చును. బయట నుంచి దాన్ని ఆపరేట్ కూడా చేయవచ్చును. శత్రువులు దాడి చేసినప్పుడు కామ్ గా ఒక్క బటన్ నొక్కితే చాలు ఆయుధం యాక్టివేట్ అయిపోతుంది. అందుకు దీనిని రష్యా నీటి అడుగునే దీనిని దాచి ఉంచుతుందని చెబుతున్నారు. ఎన్ని నెలలు నీటిలో ఉన్నా దానికి ఏమీ కాదని అంటున్నారు. ఈ డ్రోన్‌లో చిన్న, గ్యాస్-కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ అమర్చబడి ఉంది. ఇంత చిన్న పరికరంలో రష్యా అణుశక్తిని వినియోగించుకోగలగడం ఇదే మొదటిసారి.రష్యా అధ్యక్షుడు పుతిన్ మాటల్లో చెప్పాలంటే..ఇది ప్రపంచం ఇంతకు ముందు ఎన్నడూ చూడనిది.

Advertisment
తాజా కథనాలు