/rtv/media/media_files/2026/01/15/iran-2026-01-15-18-43-00.jpg)
Left Iran At 9, Found Dead In London Hotel At 31, The Tragic Story Of Princess Leila Pahlavi
Princess Pahlavi: ఇరాన్ చివరి రాజు మొహమ్మద్ రెజా పహ్లవీ చిన్న కూతురు లీలా పహ్లావి. ఈమె తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు ఇరాన్ వదిలి వెళ్లిపోయింది. 31 ఏళ్లకు లండన్‌లోని ఓ హోటల్‌లో శవమై తేలింది. ఇంతకీ ఆమె జీవితంలో అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. 1970 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో లీలా పహ్లవి జన్మించారు. రాజు రెజా పహ్లవి, రాణి ఫరా పహ్లవి నాలుగో కూతురే లీలా. ఈమె బాల్యమంతాపహ్లావి రాజకోటలోని కట్టుదిట్టమైన భద్రత మధ్య గడిచింది. ఆమె విద్యాభ్యాసం అంతా ప్రైవేట్ ట్యూటర్ల ద్వారా, రాజరిక మర్యాదలు, పర్షియన్ సంస్కృతి, చరిత్రపై ప్రత్యేక దృష్టితో సాగింది.
షా పాలనలో ఇరాన్ వేగంగా ఆధునికీకరణ చెందింది. దీంతో లీలా ఓవైపు పర్షియన్ సంప్రదాయాలను, మరోవైపు పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తూ పెరిగారు. రాజభవన వైభవం ఉన్నప్పటికీ లీలా సున్నితమైన బాలిక. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఆమెకు గాఢమైన అనుబంధం ఉంది. కానీ ఈ సురక్షితమైన, విలాసవంతమైన ప్రపంచం ఆమె జీవితంలో ఎక్కువ కాలం ఉండలేకపోయింది.
Also Read: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో వివాదం.. సిరాకు బదులు మార్కర్ పెన్నులు
1979 జనవరిలో రాజ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో పహ్లవి రాజ కుటుంబం ఇరాన్ వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో లీలాకు 9 ఏళ్ల వయసు. ఇరాన్‌లో చెలరేగిన ఈ నిరసనలు కేవలం పహ్లవి పాలనను అంతం చేయడమే కాదు.. ఆ కుటుంబానికి పౌరసత్వం, భద్రత, ఇళ్లు లేకుండా చేశాయి. ఈ సమయంలో ఆ కుటుంబం తాత్కాలికంగా ఈజిప్ట్,మోరాకో, బహమాస్, మెక్సికో, అమెరికా, పనామా లాంటి దేశాల్లో నివసించాల్సి వచ్చింది. ఇదే సమయంలో మొహమ్మద్ రెజా కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరికి 1980 జులై 27న ఆయన మరణించారు. ఆయన మరణంతో ఇక పహ్లవి కుటుంబం ఛాప్టర్ అక్కడితో ముగిసిపోయింది. మళ్లీ ఆ కుటుంబం ఇరాన్‌కు వచ్చే ఆశ కూడా లేకుండా పోయింది.
మొహమ్మద్ రెజా మరణం తర్వాత రాకుమారి ఫరా పహ్లవి కుటుంబ సభ్యులు అమెరికా స్థిరపడిపోయారు. లీలా న్యూయార్క్‌లోని యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత 1988లో రై కంట్రీ డే స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం లీలా అమెరికాతో పాటు ప్యారిస్‌లో కూడా ఉండేది. దీంతో ఆమె పర్షియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్‌తో పాటు ఇతర భాషలు కూడా అవలీలగా మాట్లాడేది. కానీ లీలా యువరాణిగా ఉండే సౌకర్యాన్ని మాత్రం చిన్న వయసులోనే కోల్పోయింది.
Also Read: బైడెన్ నాలుగేళ్లలో చేసింది.. ట్రంప్ ఏడాదిలోనే చేశాడు.. ప్రపంచాన్ని వణికించే రిపోర్ట్!
లీలా యుక్త వయస్సుకు వచ్చాక ఆమెకు తీవ్రమైన అనారోగ్య సవాళ్లు ఎదురయ్యాయి. దీర్ఘకాలిక అలసట, డిప్రెషన్, తీవ్రమైన అనోరెక్సియా సమస్యలతో బాధపడేది. దీంతో అమెరికా, యూకేలో పదేపదే చికిత్సలు తీసుకునేది. డాకర్లు ఇచ్చే మందులపై ముఖ్యంగా నిద్ర మాత్రలపై ఆధారపడటంతో కూడా ఇబ్బందులు పడింది. లీలా తల్లి ఫరా ఆమెను దగ్గరుండి చూసుకునేది.
లీలా ప్రజాజీవితానికి దూరంగా ఉండేది. అయినప్పటికీ ఆమె ప్యారిస్‌లో కొంతకాలం మోడల్‌గా పనిచేసింది. చివరికి లీలా 31 ఏళ్ల వయసులో 2001 జూన్ 10న లండన్‌లోని లియోనార్డ్ హోటల్‌లో మృతి చెందింది. అధిత మోతాదులో మాత్రలు తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు విచారణలో తేలింది. తన శరీరంలో కోకైన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. మొత్తానికి లీలా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తీర్పు వెల్లడైంది. ఆమె మృతదేహాన్ని ప్యారిల్‌లో ఖననం చేశారు. 2011లో లీలా సోదరుడు అలీ రెజా కూడా మరణించారు.
Follow Us