/rtv/media/media_files/2026/01/16/israel-2026-01-16-15-06-46.jpg)
Israel jolted by earthquake, But why are rumours rife about nuclear testing amid Iran tensions?
ఇజ్రాయెల్‌లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అక్కడి ప్రభుత్వం అణ్వాయుధ పరీక్షలు చేయడం వల్లే ఈ భూకంపం వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. డొమినాకు సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం వెల్లడించింది.
ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, బీర్షెబా వంటి నగరాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇది సహజంగా వచ్చిన భూకంపం కాదని ఇజ్రాయెల్ రహస్యంగా నిర్వహించిన అణ్వాయుధా పరీక్షల ఫలితమని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. దీనిపై కొందరు నిపుణలు పలు కీలక విషయాలు వెల్లడించారు.
వాస్తవానికి సహజ సిద్ధంగా వచ్చే భూకంపాలకు, అణు పేలుళ్ల వల్ల వచ్చే ప్రకంపనలకు మధ్య తేడా ఉంటుంది. అణు పరీక్ష జరిగితే 'సిస్మోగ్రాఫ్' మీద వచ్చే గ్రాఫ్ చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ప్రారంభంలోనే భారీ పీక్ పాయింట్‌కి చేరుతుంది. అయినప్పటికీ ఈ ఘటనలో నమోదైన తరంగాలు మాత్రం సాధారణ భూకంప తరంగాలనే పోలి ఉంటాయి.
Also Read: 4 ఏళ్లలో 3.3 లక్షల మంది దుర్మరణం..బైక్ ప్రమాదాల్లో చనిపోతున్న జనాలు
ఇజ్రాయెల్ విషయంలో చూసుకుంటే అక్కడి భౌగోళిక ప్రాంతం 'సిరియన్-ఆఫ్రికన్ రిఫ్ట్‌పై ఉంది. ఇది భౌగోళికంగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉన్న యాక్టివ్ జోన్. అందువల్ల ఇక్కడ 4.0 నుంచి 4.5 తీవ్రతతో భూకంపాలు సంభవించడం సాధారణమేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ అండ్ జియోలాజికల్ సర్వే ఈ భూకంపం వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేశాయి. కానీ అణ్వాయుధ పరీక్షలు జరిగాయన్న వార్తలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ కూడా న్యూక్లియర్ ఆయుధాలు తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఇటీవల ట్రంప్ కూడా ఇరాన్ అణు కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తే, తక్షణమే సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ వద్ద కూడా 90 నుండి 200 వరకు అణ్వాయుధాలు ఉండోచ్చని అంతర్జాతీయ నిఘా సంస్థలు, సైనిక నిపుణుల అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తాజాగా న్యూక్లియర్ టెస్ట్ చేసినట్లు మరికొందరు నిపుణులు అనుమానిస్తున్నారు.
An earthquake near Israel’s Dimona nuclear facility has set off a wave of nuclear rumours and security jitters, coming just as tensions between the United States, Iran and Israel are at their peak. The 4.2‑magnitude quake, felt in the Dead Sea area and the southern Negev,… pic.twitter.com/EnlvFQPsWY
— Hindustan Times (@htTweets) January 15, 2026
Also Read: నగరాలను మింగేసే ఆయుధం..రష్యా చేతిలో జలరాక్షసి పోసిడాన్
Follow Us