Tariff War: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్

ఒకవైపు అదనపు సుంకాలు అమలు అవుతాయని ట్రంప్ ప్రభుత్వం భారత్ కు నోటీసులు పంపించింది. మరోవైపు చైనా మీదా విరుచుకుపడుతోంది. రేర్ ఎర్త్ మాగ్నెట్ లను సరఫరా చేయకపోతే 200శాతం సుంకాలను విధిస్తామని బెదిరించింది. 

New Update
china tariffs

Tariffs On China

చైనా(China) ను కూడా తన గుప్పిట్లోకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ఆ దేశంలో లభించే రేర్ ఎర్త్ మాగ్నెట్లపై డిమాండ్ పెట్టారు. ఆ అయస్కాంతాలను చైనా మాకు ఇవ్వాల్సిందేనని అంటున్నారు ట్రంప్. ఆటో మోటివ్ నుంచి రక్ణ వరకు పరిశరమలలో ఉపయోగించే రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ను చైనా ప్రముఖ ఉత్పత్తిదారుగా ఉంది. అయితే ఇవి తమకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని..ఈ మాగ్నెట్స్ ఉంటే చాలా వస్తువులు అమెరికాలోనే తయారు చేసుకోవచ్చని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. అందుకే వాటిని తమకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తోంది. అలా చేయకపోతే చైనాపై 200 శాతం సుంకాలు విధిస్తామని బెదిరిస్తోంది. 

Also Read :  యుఎస్ టెక్ సంస్థలు మీ పిగ్గీ బ్యాంక్ లు కాదు.. విరుచుకుపడ్డ ట్రంప్

మా ఆంక్షలను ఒప్పుకోవాల్సిందే..

ఈరోజు వాషింగ్టన్ లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌(lee-jae-myung) తో  జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇందులో అమెరికా-చైనా సంబంధాల స్థితిగతులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో జరిపిన చర్చల గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది చివరకు తాను చైనా వెళ్తానని...కానీ ఆ లోపు ఆ దేశం తమకు ఎర్త్ మాగ్నెట్స్ ను సరఫరా చేయడానికి ఒప్పుకోవాలని ట్రంప్ కండిషన్ పెడుతున్నారు. చైనా మా దారికి రావాల్సిందేనని చెబుతున్నారు.  ఆ దేశానికి సంబంధించిన కొన్ని కార్డ్స్ తమ దగ్గర ఉన్నాయని...వాటిని తాను వాడడం మొదలుపెడితే...అది చైనాను నాశనం చేస్తుందని ట్రంప్ అన్నారు. ఎర్త్ మాగ్నెట్స్ ఇవ్వకపోతే వారిపై 200శాతం టారిఫ్‌లు విధిస్తాం. దానివల్ల మాకు ఎలాంటి సమస్యా రాదు అని ట్రంప్‌ హెచ్చరించారు.

మొదటి నుంచీ చైనాతో వాణిజ్య యుద్ధం..

అమెరికా, చైనాల మధ్య టారీఫ్ ల వార్ ఎప్పటి నుంచో నడుస్తోంది. అంతకు ముందు కూడా ట్రంప్ చైనాపై 125 శాతం సుంకాలను విధించారు. తరువాత దాన్ని 30 శాతానికి తీసేకువచ్చారు. దీనికి ప్రతిగా చైనా కూడా పది శాతం సుంకాలను విధించింది. అయితే ట్రంప్ అన్ని దేశాలతో పాటూ చైనాకు కూడా 90 రోజుల విరామాన్ని ఇచ్చారు. గడువు ముగిసిన తరవాత కూడా మళ్ళీ 90 రోజుల గ్యాప్ ను అమలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం చల్లబడింది. కానీ ఇప్పుడు మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లతో విరుచకుపడతానని బెదిరిస్తున్నారు. ఆ దేశంతో మిత్రత్వం తమకు ఎంతో అవసరమని..అయినా సరే మేము పెట్టిన ఆంక్షలకు ఒప్పుకోవాల్సిందేనని అంటున్నారు. 

Also Read :  టీచర్‌కు 215 ఏళ్లు జైలు శిక్ష.. ఇంతకీ ఆ నీచుడు ఏం చేశాడో తెలుసా?

Advertisment
తాజా కథనాలు