Digital Tax: యుఎస్ టెక్ సంస్థలు మీ పిగ్గీ బ్యాంక్ లు కాదు..విరుచుకుపడ్డ ట్రంప్

డిజిటల్ పన్నులపై అమెరికా అధ్యక్షుడు ట్రప్ విరుచుకుపడ్డారు. యూఎస్ టెక్ కంపెనీలు మీ పిగ్గీ బ్యాంకులు కాదంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధిస్తే ఊరుకునేది లేదని అన్నారు.  వెంటనే వాటిని తీసేయకపోతే అదనపు సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.

New Update
digital

Trump About Digital Tax

అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలపై పలు దేశాలు డిజిటల్ ట్యాక్స్(Digital Tax) విధిస్తున్నాయి. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పెద్ద పోస్ట్ రాశారు. అమెరికన్ టెక్ కంపెనీలపై దాడి చేసే దేశాలను తాను ఎదుర్కొంటానని ట్రంప్ అన్నారు. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్, మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఆపిల్ మరియు అమెజాన్ వంటి అమెరికన్ సంస్థలపై అన్యాయంగా ట్యాక్స్ లు విధిస్తున్నారన్నారు. 

Also Read :  భారత్ పైకి డ్రోన్ ఎటాక్.. మళ్లీ తెగబడ్డ పాక్!

అవేమైనా మీ పిగ్గీ బ్యాంకులనుకుంటున్నారా..

డిజిటల్ పన్నులు, డిజిటల్ సేవల చట్టం, డిజిటల్ మార్కెట్ల నిబంధనలు, డిజిటల్‌ మార్కెట్‌ రెగ్యులేషన్స్‌(Digital Market Regulations) అన్నీ అమెరికన్ టెక్నాలజీకి హాని కలిగించడానికి లేదా వివక్ష చూపడానికి రూపొందించబడ్డాయని విరుచుకుపడ్డారు.  చైనా వంటి మిగతా దేశాలపై ఈ పన్నులు వేయడం లేదని...కేవలం యూఎస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారననున్నారు.  అమెరికా టెక్ కంపెనీలు(US Tech Companies) ఏమీ మీ పిగ్గీ  బ్యాంకులు కావంటూ మండిపడ్డారు ట్రంప్.  తమ దేశంలో ఉన్న టెక్ కంపెనీలను గౌరవించాలని..లేదంటూ తాను తీసుకునే నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మా టెక్ కంపెనీలపై ట్యాక్స్ లు విధించే దేశాలపై అదనపు పన్నులతో దాడి చేస్తానని హెచ్చరించారు.  అంతేకాదు మా అత్యంత రక్షిత సాంకేతికత, చిప్‌లపై ఎగుమతి పరిమితులను కూడా విధిస్తామని అన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ కలిసి అన్యాయమైన వాణిజ్య అడ్డంకులను పరిష్కరిస్తామని ట్రంప్ చెప్పారు. ఎలక్ట్రానిక్ ప్రసారాలపై కస్టమ్స్ సుంకాలను విధించమన్నారు. దీనికి సంబంధించి కెనడాతో అన్ని వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. 

DT

Also Read: Stock Market Crash: టారీఫ్ ల ప్రభావం..సెన్సెక్స్, నిఫ్టీ క్రాష్..

Advertisment
తాజా కథనాలు