Teacher : టీచర్‌కు 215ఏళ్లు జైలు శిక్ష.. ఇంతకీ ఆ నీచుడు ఏం చేశాడో తెలుసా?

కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఓ రిటైర్డ్ టీచర్‌కు లైంగిక వేధింపుల కేసులో 215 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కిమ్ కెన్నెత్ విల్సన్ 2000 నుంచి 2023 వరకు డెల్ పాసో హైట్స్ ఎలిమెంటరీ స్కూల్‌లో పని చేశాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

New Update
teacher Kim Kenneth Wilson

Kim Kenneth Wilson

స్కూల్‌లో టీచర్‌(School Teacher) గా పని చేసిన వ్యక్తి 215ఏళ్లు జైలు శిక్ష(Prison) విధించింది కోర్టు. అసలు అన్ని సంవత్సరాలు మనిషి బతకడు కదా.. మరి శిక్ష ఎలా అనుభవిస్తాడని చాలామందికి సందేహం రావొచ్చు. అతను చేసిన నేరాలు అన్నీ కలిపితే మొత్తం అన్ని ఏండ్లు శిక్ష పడవచ్చు. అతనిపై 36 అభియోగాలు నమోదైయ్యాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఓ రిటైర్డ్ టీచర్‌కు లైంగిక వేధింపుల కేసులో 215 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 2000 నుంచి 2023 వరకు డెల్ పాసో హైట్స్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన 64 ఏళ్ల కిమ్ కెన్నెత్ విల్సన్(Kim Kenneth Wilson), విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విల్సన్ దోషిగా తేలడంతో కోర్టు కఠిన శిక్షను ఖరారు చేసింది.

Also Read :  గాజాలో హస్పిటల్‌పై ఇజ్రాయిల్ దాడి

Kim Kenneth Wilson To 215 Years In Prison

ప్రాసిక్యూటర్ల ప్రకారం, విల్సన్ పాఠశాలలో ఒక బ్రాడ్‌కాస్టింగ్ క్లబ్‌ను ఏర్పాటు చేసి, దాని కోసం ఓ స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాడు. ఈ క్లబ్ ముసుగులో, అతను విద్యార్థినులను ఆ గదిలోకి ఒంటరిగా పిలిచి వారిపై లైంగిక దాడులకు(Sexual Assault) పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, తన ఇంట్లో నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా కూడా అతను విద్యార్థినులను వేధించినట్లు వెల్లడైంది.

Also Read :  భీకర దాడులు.. యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం..

పోలీసులు విల్సన్ ఇంట్లో సోదాలు నిర్వహించగా, లైంగిక దాడులకు సంబంధించిన వీడియో టేపులు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. ఈ సాక్ష్యాల ఆధారంగా విల్సన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విల్సన్, పిల్లలపై అభ్యంతరకర చర్యలకు పాల్పడిన అభియోగాలను అంగీకరించాడు. ఈ కేసులో పలువురు బాధితులు ఉండడం, అతను నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అతనికి 215 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.

ఈ కేసు సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేసి విల్సన్ చేసిన నేరాలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే, విల్సన్ తన శిక్షలో దాదాపు 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత, వృద్ధుల విడుదల కార్యక్రమం కింద పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అతనికి 64ఏళ్లు.

Advertisment
తాజా కథనాలు