Bangladesh Riots: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. రాత్రికి రాత్రే అల్లకల్లోలం

బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ మరణవార్తతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అవామీ లీగ్ ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు.

New Update
4564161231

బంగ్లాదేశ్‌(bangladesh-riots)లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ(Osman Hadi death) మరణవార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనా(Bangladesh Ex PM Sheikh Hasinaకు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టడమే కాకుండా, ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ఓస్మాన్ హాదీపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకుని భారీ నిరసన చేపట్టారు. bangladesh protests sheikh hasina

Also Read :  ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర..ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Bangladesh Riots Again

హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్‌షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసి, నిప్పు పెట్టారు. అలాగే షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా, దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత్ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. భవనం లోపల జర్నలిస్టులు చిక్కుకుపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 25 మంది జర్నలిస్టులను రక్షించారు.

Also Read :  భారత్ దెబ్బకు నాశనమైన ఎయిర్ బేస్ లు..రిపేర్లు చేసుకుంటున్న పాక్

ఛటోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఈ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ ఓస్మాన్ హాదీ మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. శనివారం (డిసెంబర్ 20) నాడు దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినం ప్రకటించారు. హాదీ హంతకులను విడిచిపెట్టబోమని, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రధాన నిందితుల సమాచారం అందించిన వారికి రూ.50 లక్షల టాకా నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు