/rtv/media/media_files/2025/10/04/pakistan-1-2025-10-04-08-39-42.jpg)
పాకిస్తాన్, అరబ్ తో పాటూ ముస్లిం దేశాలన్నీ ట్రంప్ శాంతి సూత్రాలకు మొదట మద్దతు తెలిపాయి. కానీ ఇప్పుడు హమాస్ కూడా అంగీకరించిన వేళ ఆ దేశాలన్నీ తమ మద్దతును వెనక్కు తీసుకుంటున్నాయని తెలుస్తోంది. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ట్రంప్ ప్రతిపాదనను ముస్లిం మె.ఆరిటీ దేశాల మద్దతున్న ముసాయిదా ఏకీభవించదని ఆయన స్పష్టం చేశారు.
కావాలనే చేస్తోంది..
అయితే ఇదంతా పాకిస్తాన్ కావాలనే చేస్తుందని అంటున్నారు. అరబ్ దేశాలు దీని మీద ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదని..కానీ పాకిస్తాన్ మాత్రం కావాలనే చేస్తోందని అంటున్నారు. తమ స్వదేశంలో నిరసనల నుంచి తప్పించుకోవడానికే ఇదంతా చేస్తుందని చెబుతున్నారు.కానీ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాత్రం ట్రంప్ విడుదల చేసిన ముసాయిదాను పాకిస్తాన్ సహా ముస్లిం దేశాలు ప్రతిపాదించిన మేఉసాయిదాకు భిన్నంగా ఉందని చెప్పారు. ట్రంప్ శాంతి ఒప్పందంపై ఉన్న సందేహాలను ఇజ్రాయెల్ గుర్తించడానికి రెడీగా లేదని ఆరోపించారు. ట్రంప్ రూపొందించిన గాజా శాంతి ప్రణాళిక నిజంగా మాది కాదు...మా ముసాయిదాలో మార్పులు చేయబడ్డాయి అని ఇషాక్ దార్ అన్నారు.
లాస్ట్ మంత్ న్యూయార్క్ లో ట్రంప్ ను కలిసిన సమయంలో పాకిస్తాన్ మరో ఏడు దేశాలతో కలిసి అమెరికా నుంచి 20 అంశాల అజెండాను అందుకున్నామని ఇషాక్ దార్ తెలిపారు. గత నెలలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్ సందర్భంగా ఎనిమిది ముస్లిం, అరబ్ దేశాల నాయకులు - జోర్డాన్, యుఎఇ, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్ - సంయుక్తంగా ట్రంప్‌ను కలిశామని తెలిపారు. అయితే దానిపై తాము సవరణలను ప్రతిపాదించామని..కానీ వాటిని ట్రంప్ పట్టించుకోలేదని చెప్పారు. తాము శాంతి ప్రతిపాదనపై వ్యతిరేకత తెలుపుతామని..ఇజ్రాయెల్ గుర్తించకపోతే భారీ నిరసనలు తెలుపుతామని ఇషాక్ దార్ అన్నారు. అయితే అంతకు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ట్రంప్ గాజా పీస్ ప్లాన్ ప్రణాళికను స్వాగతించారు. అరబ్ దేశాలు
కూడా మద్దతు తెలిపాయని చెబుతున్నారు. అవి శాంతి ప్రణాళిక స్వాగతిస్తూ సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశాయి. గాజాలో యుద్ధాన్ని ముగించడానికి నిజాయితీగా చేసిన ప్రయత్నాలని చెప్పారు.
Also Read: USA: విదేశీ ఉద్యోగులపై సెనేటర్ల ప్రశ్నలు..టీసీఎస్ కు లేఖ