Indian Students: అమెరికాకు నో చెబుతున్న భారత విద్యార్థులు..జూలై-ఆగస్టులో 50శాతం తగ్గుదల

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు రావడానికి మొగ్గు చూడం లేదు. ట్రంప్ ప్రభుత్వం పెడుతున్న కండిషన్లకు వారు దారులు వెతుక్కుంటున్నారని తెలుస్తోంది. జూలై-ఆగస్టు నెలల్లో దాదాపు 50శాతం విద్యార్థులు తగ్గిపోయారని చెబుతున్నారు.

New Update
indian students

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. అక్రమవలదారులపై ఉక్కుపాదం మోపారు. దాంతో పాటూ విదేశీ విద్యార్థులపై కూడా విపరీతమైన ఆంక్షలను పెట్టారు. యూనివర్శిటీలో చదువుకునే విద్యార్థులు ఎక్కడా పని చేయకూడదని..వారు ఎలాంటి గొడవల్లో తలదూర్చకూడదు లాంటి ఎన్నో రూల్స్ ను పెట్టారు. దాంతో పాటూ యూనివర్శిటీలకు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. దానికి తోడు వీసా విధానాల్లో కూడా చాలా మార్పులు  చేశారు. వాటిని కఠినతరం చేశారు. దీంతో అమెరికాలో చదువుకోవాలంటే ఫారిన్ స్టూడెంట్స్ భయపడుతున్నారు. అమెరికాలో చదువుకోవాలంటే అసలు మందే చాలా డబ్బులు అవుతాయి. దానికి తోడు ట్రంప్ పెట్టిన కండిషన్లు వారు ఇక్కడకు చదువుకోవడానికి మరింత కష్టం అవుతోంది. 

సగానికి పైగా తగ్గిపోయారు..

ఈ కారణాల వల్లనే భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది జూలై-ఆగస్ట్ లో అమెరికాకు వచ్చే భారత విద్యార్థుల సంఖ్య దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. దాదాపు ఇది 50శాతంగా ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ డేటా చూపించింది. ఈ గణనీయమైన తగ్గుదల 2025-26 విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతుందని ,అంతర్జాతీయ విద్యార్థులపై ఎక్కువగా ఆధారపడే యూనివర్శిటీలు, కాలేజీలు చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుందని ఫోర్బ్స్ నివేదిక చెబుతోంది. దీనికి తోడు ఒక సర్వే ప్రకారం 54 శాతం మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమం లేకపోతే విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు మొగ్గు చేపరని తెలుస్తోంది. దీని కారణంగా విశ్వవిద్యాలయాలకు వచ్చే నిధులు తగ్గిపోతాయని చెబుతున్నారు. 

ADIS/I-94 ఇమ్మిగ్రేషన్ రికార్డుల ఆధారంగా US ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం, భారతదేశం నుండి విద్యార్థుల రాక 44.5% తగ్గింది. ఆగస్టు 2024లో 74,825 నుండి ఆగస్టు 2025లో 41,540కి తగ్గింది.జూలై 2024 తో పోలిస్తే జూలై 2025 రాకపోకలు కూడా 46.4% తగ్గాయి. నివేదిక ప్రకారం..ఇది 24,298 నుండి 13,027కి తగ్గాయి. ట్రంప్ పరిపాలనలో ఆయన ప్రవేశ పెట్టిన వలస విధానాల వలనే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధానాలతో వారాల పాటు వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయడం , దరఖాస్తుదారుల సోషల్ మీడియా పరిశీలిచడం వంటివి వాటిపై విద్యార్థులు విముఖత చూపిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత  మళ్ళీ 2025లోనే ఇంతలా విద్యార్థి వీసాలు తగ్గిపోయాయని యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన డేటా చెబుతోంది. 

Also Read: Gaza Peace Plan: గాజా పీస్ ప్లాన్ పై పాక్ తో పాటూ ముస్లిం దేశాల అసంతృప్తి..వెనక్కు వెళ్ళే ఛాన్స్?

Advertisment
తాజా కథనాలు