Pakistan Defense Minister: పార్లమెంటులో నవ్వులపాలైన పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి..

పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ పార్లమెంటులో ఓ ప్రకటన చేసి నవ్వులపాలయ్యారు. ' నిన్న జరిగిన భారత్‌ డ్రోన్ దాడి మన స్థావరాలు తెలుసుకునేందుకే చేశారు. వాటి గురించి భారత ఆర్మీకి తెలియకుండా ఉండేందుకే వాటిని అడ్డుకోలేదని'' అన్నారు.

New Update
Subscribe to Notifications Pakistan's defence minister Khawaja Asif

Subscribe to Notifications Pakistan's defence minister Khawaja Asif

Pakistan Defense Minister: ఆపరేషన్ సింధూర్‌(Operation Sindoor) తర్వాత పాకిస్థాన్‌ భారత్‌పై(India) డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు(Missile Attacks) యత్నించింది. వీటిని మన ఇండియన్ ఆర్మీ(Indian Army) తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇస్లామాబాద్, లాహోర్, సియోల్ కోట, బహల్‎వాల్‏పూర్‎పై మెరుపు దాడులు చేసింది. అయితే గురువారం పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌(Khawaja Asif) పార్లమెంటులో ఓ ప్రకటన చేసి నవ్వులపాలయ్యారు. భారత్‌ జరిపిన డ్రోన్ దాడులపై ఆయన మాట్లాడారు. '' నిన్న జరిగిన భారత్‌ డ్రోన్ దాడి మన స్థావరాలు తెలుసుకునేందుకే చేశారు. వాటి గురించి భారత ఆర్మీకి తెలియకుండా ఉండేందుకే వాటిని అడ్డుకోలేదని'' అన్నారు. దీంతో ఈ ప్రకటనతో ఆయన నవ్వులపాలయ్యారు. 

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

Also Read: ఆ వార్తలు ప్రచారం చేయకండి.. మీడియాకు కేంద్రం హెచ్చరిక

డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్‌ జెట్లతో దాడులు..

ఇక ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఇప్పటికే ఆ దేశ స్టాక్‌ మార్కెట్ కుప్పకూలపోయింది. గురువారం రాత్రి పాక్.. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్‌ జెట్లతో దాడులకు యత్నించింది. కానీ వీటన్నింటిని భారత సైన్యం భగ్నం చేసింది. ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసి వాటిని నేలకూల్చింది. మరోవైపు భారత్‌పై ప్రయోగించిన డ్రోన్ దాడుల్లో పాకిస్థాన్ టర్కీ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టర్కీ పంపించిన డ్రోన్లనే భారత్‌పై ప్రయోగించినట్లు సమాచారం. 

Also Read: పాకిస్థాన్ నుంచి పారిపోయిన దావూద్‌ ఇబ్రహీం..

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు నిరసన సెగ తగులుతోంది. ఆ దేశ రాజకీయ నేతలే ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గురువారం ఓ పాకిస్థాన్ ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ షెహబాద్‌ షరీఫ్ పిరికివాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేరాకాదు ఈ ఎంపీ అప్పట్లో మైసూర్‌ రాజైన టిప్పు సుల్తాన్ చెప్పిన సూక్తిని కూడా ప్రస్తావించారు. '' ఒక సమూహానికి పులి నాయకత్వం వహిస్తుందంటే ఆ సమూహంలో ఉన్న పిరికివాళ్లు కూడా పులిలాగే పోరాడుతారు. కానీ పులులు ఉన్న గ్రూప్‌కు పిరికివాడు నాయకత్వం వహిస్తే.. ఆ గ్రూప్‌లో ఉండే పులులు కూడా పిరికివాడిలా పోరాడుతాయని'' అన్నారు.   

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

telugu-news | rtv-news not 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు