Govt Warns Media: ఆ వార్తలు ప్రచారం చేయకండి.. మీడియాకు కేంద్రం హెచ్చరిక

దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు కవరేజీ చేసేటప్పుడు సంయమనం పాటించాలని మీడియా సంస్థలకు కేంద్ర రక్షణశాఖ సూచించింది. సమాచారాన్ని లీక్ చేస్తే భద్రతా దళాల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పింది.

New Update
Government Warns Media Against Live Broadcasts of Military Operations

Government Warns Media Against Live Broadcasts of Military Operations

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు, దళాల కదలికలను కవరేజీ చేసేటప్పుడు సంయమనం పాటించాలని మీడియా సంస్థలకు సూచించింది. '' భద్రతా దళాలు చేపట్టే ఆపరేషన్ల సమాచారాన్ని చేరవేస్తే వాళ్ల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుంది. గతంలో కార్గిగ్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్‌ హైజక్ ఘటనలు జరిగినప్పుడు కూడా మీడియా చూపించిన అత్యుత్సాహమే వీటికి నిదర్శనం. 

Also Read: 'చర్చలు జరపండి.. యుద్ధం ఆపండి': బోరున ఏడ్చిన మెహబూబా ముఫ్తీ-VIDEO

కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం చూసుకుంటే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టే సమయంలో అర్హత ఉన్న ఉన్న అధికారి మాత్రమే సమయానుసారం బ్రీఫింగ్స్‌ చెప్పేందుకు అర్హులవుతారు. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. బాధ్యాతాయుతంగా ఉండాలని'' రక్షణ శాఖ తెలిపింది. 

Also Read: పాకిస్థాన్ నుంచి పారిపోయిన దావూద్‌ ఇబ్రహీం..

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ సిందూర్‌ విషయంలో ఫేక్ వార్తలు ప్రచారం కాకుండా చర్యలు తీసుకుంటోంది. పీబీఐ ఫ్యాక్ట్‌చెక్‌లు చేయిస్తోంది. గుజరాత్‌లోని పోర్టు, జలంధర్‌లో డ్రోన్, క్షిపణి దాడులంటూ వీటికి సంబంధించిన వీడియోలను పాక్ అనుకూల వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ వీటిని భారత్ తిప్పికొట్టింది. PIB ఫ్యాక్ట్‌చెక్‌ చేసి అవన్నీ కూడా ఫేక్ దృశ్యాలే అని స్పష్టం చేసింది. 

Also Read: ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

 ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు నిరసన సెగ తగులుతోంది. ఆ దేశ రాజకీయ నేతలే ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గురువారం ఓ పాకిస్థాన్ ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ షెహబాద్‌ షరీఫ్ పిరికివాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

rtv-news | Indian Army | india pakistan war

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు