Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

యూఎస్‌ఎయిడ్‌ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొంది.యూఎస్‌ నుంచి సాయం ఆగిపోతే దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి గావి ఆందోళన వ్యక్తం చేసింది.

New Update
usaid

usaid

యూఎస్‌ఎయిడ్‌ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే.దీంతో అమెరికా సాయం పై ఆధారపడి నడిచే అనేక సంస్థల పై దీని ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి గావి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!

అమెరికా నుంచి సాయం ఆగిపోతే వినాశకరమే అవుతుందని ,దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. గావికి అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య భద్రత పై వినాశకర ప్రభావం చూపుతుంది. నిర్మూలించగలిగే వ్యాధులతో దాదాపు 10 లక్షల మరణాలు సంభవించవచ్చు. ప్రమాదకరవ్యాధుల వ్యాప్తి అనేక జీవితాల పై పడనుందని అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సానియా నిష్టర్‌ పేర్కొన్నారు.

Also Read: Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

అయితే నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదన్నారు. దీని పై వైట్‌ హౌస్‌ సహా కాంగ్రెస్‌ తోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.ఈ ఏడాది కార్యక్రమాల కోసం అమెరికా పార్లమెంట్‌ ఆమోదించిన 300 మిలియన్‌ డాలర్లను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా మానవతా దృక్పథంతో సహాయం చేయడానికీ , ఆయా దేశాల అభివృద్ధికీ,భద్రతకూ నిధులు సమకూర్చడానికీ అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ ఏర్పాటైంది.

దాదాపు 120 దేశాల్లో వివిధ కార్యక్రమాల కోసం ఏటా వందలకోట్ల డాలర్లను సాయంగా అందిస్తున్నారు. అయితే ఈ సంస్థను మూసివేస్తున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించడం సంచలనం రేపింది. మరో వైపు  అనేక వారాల సమీక్ష అనంతరం దాదాపు 5 వేలకు పైగా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధికారులు ఇటీవల ప్రకటించారు.

విదేశాంగశాఖ కింద కేవలం కొన్ని కార్యక్రమాలకే ఆర్థికసాయాన్ని అందిస్తామన్నారు.అయితే ఈ రద్దకు సంబంధించి ఇటీవల లీకైన 281 పేజీల షీట్‌ లో అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి గావి ఉండటం తాజా ఆందోళనకు కారణమైంది.బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ ,యునిసెఫ్‌, ప్రపంచబ్యాంకు ఇందులో భాగస్వామ్యంతో 2000 లో ఈ కూటమి ఏర్పాటైంది. 

పేద దేశాల్లోని చిన్నారులు ప్రమాదకర వ్యాధుల బారినపడకుండా నిరోధించే వ్యాక్సిన్‌ లను ఉచితంగా అందజేస్తుంది.

Also Read: Police Crime: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!

Also Read: TG Love case: ఒకరితో శృంగారం.. మరొకరితో సంసారం: యువకుడి పెళ్లి పెటాకులు చేసిన కాన్ఫరెన్స్ కాల్!

 USAID funding | us | america | india | bharat | latest-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
తాజా కథనాలు