USAID: 5200 కార్యక్రమాలకు యూఎస్ ఎయిడ్ నిధులు నిలిపివేత
అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. యూఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5200 కార్యక్రమాలకు రద్దు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.