Police Crime: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!

యూపీ దుబౌలియా పోలీస్ స్టేషన్ లో ఘోరం జరిగింది. ఉభాయ్ గ్రామానికి చెందిన ఆదర్శ్ ఉపాధ్యాయ్ అనే మైనర్‌ బాలుడిని దాడి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆదర్శ్ చనిపోవడంతో స్టేషన్ ఇంచార్జ్, ఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

New Update
upp police

UP Dubaulia police Third degree punishment on minor boy

Police Crime: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బస్తీ జిల్లాలో పోలీసు కస్టడీలో మైనర్ బాలుడు మరణించడం సంచలనం రేపుతోంది. దాడి ఆరోపణలపై అరెస్ట్ చేసి ఆ పసివాడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. అంతేకాదు చిత్రహింసలకు గురిచేయడంతో ఆ బాలుడు మరణించాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై పోలీసు యంత్రాంగం వెనక్కి తగ్గగా.. స్టేషన్ ఇన్‌ఛార్జితోపాటు మరో ఇద్దరు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

రక్తం వాంతులు చేసుకుని..

దుబౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉభాయ్ గ్రామానికి చెందిన ఆదర్శ్ ఉపాధ్యాయ్ అనే మైనర్‌ను దాడి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అతని పరిస్థితి విషమించడంతో అదే రాత్రి ఇంట్లో వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ బాలుడు రక్తం వాంతులు చేసుకుని ఇంట్లోనే చనిపోయాడు. ఈ సంఘటనపై ఆదర్శ్ పేరెంట్స్, బంధువులు, ఎస్పీ నాయకులు ఐక్యమై న్యాయం కోసం నిరసకు దిగారు. మృతదేహాన్ని దహనం చేయకుండానే ధర్నా చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అజయ్ సింగ్, మాజీ మంత్రి రాజ్‌కిషోర్ సింగ్, రాష్ట్ర మంత్రి మహేష్ శుక్లా, జిల్లా అధ్యక్షుడు వివేకానంద్ మిశ్రా, ఇద్దరు ఎస్పీ ఎమ్మెల్యేలు మహేంద్ర నాథ్ యాదవ్, కవింద్ర చౌదరిలతో పాటు వందలాది మంది  పోస్ట్‌మార్టం హౌస్, డీఎం నివాసం ముందు నిరసన చేపట్టారు. 

Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

పరిస్థితి విషమించడంతో  పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి జితేంద్ర సింగ్‌, ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంఘటన జరిగిన తర్వాత, సంఘటనా స్థలాన్ని సందర్శించాల్సిన అవసరం కూడా లేదని ఎస్పీ మౌనం వహించడంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాయకుల ఒత్తిడి కారణంగా 10 గంటల తర్వాత చర్య తీసుకున్నారని,  పరిపాలన అలసత్వ వైఖరిపై ప్రజలు కోపంగా ఉన్నారు. మేజిస్ట్రేట్ దర్యాప్తు తర్వాత మరిన్ని నిందితులపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

up | minor-boy | today telugu news | rtv telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లో 300 మంది ఉద్యోగులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

New Update
AP Fire Accident

AP Fire Accident

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే.. సరైన సమయానికి అగ్నిమాపాక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ ఏమైనా దగ్ధం అయ్యాయా? అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఫైర్ సిబ్బందిని తప్పా.. ఎవరినీ కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ తదితరులు కొద్ది సేపట్లో నిధి భవన్ ను సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: పాకిస్థాన్‌లో స్కూల్‌ బస్సుపై ఉగ్రదాడి.. నలుగురు చిన్నారులు మృతి

గత నెలలో సచివాలయంలో ప్రమాదం..

గత నెల 4న ఏపీ సచివాలయంలోనూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో అంతస్తులో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత తదితరులు ఉండే ముఖ్యమైన ఈ ఫ్లోర్ లో ప్రమాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే.. ఉదయం సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: అకౌంట్‌లోకి రూ.15000 ఆ రోజే!

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. సచివాలయం మొత్తం కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఎలాంటి ప్రమాదం జరిగినా కారణాలను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుదన్నారు. భద్రతా ప్రమాణాలపై ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. 

(telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment