TG Love case: ఒకరితో శృంగారం.. మరొకరితో సంసారం: యువకుడి పెళ్లి పెటాకులు చేసిన కాన్ఫరెన్స్ కాల్!

ఆదిలాబాద్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి జీవితాన్ని ఓ ఫోన్ కాల్ తలకిందులు చేసింది. ప్రేయసితో మాట్లాడుతుండగా పెళ్లి చేసుకునే అమ్మాయి కాల్ చేసింది. అది కాన్ఫరెన్స్ కనెక్ట్ కావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

New Update
adoilabad love

Adilabad love case

TG Love case: తెలంగాణలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మరో కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి జీవితాన్ని ఓ ఫోన్ కాల్ తలకిందులు చేసింది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధమవుతూనే మరోవైపు లవర్‌తో రిలేషన్ పెట్టుకోవడం పెళ్లి పెటాకులు అయ్యేలా చేసింది. రెండు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొనగా ఆ యువకుడు చేసిన ఘనకార్యంతో ఒక్కసారిగా విషాదం నిండుకున్నంత పనైంది. ఈ సంఘటన  ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

చేసుకోబోయే అమ్మాయితో కాకుండా ప్రేయసితో..

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువకుడికి అదే జిల్లాలో మరో మండలానికి చెందిన యువతితో ఇటీవలే పెళ్లి కుదిరింది. నెల రోజుల కిందట పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. రెండు కుటుంబాల్లో సందడి మొదలైంది. అయితే కాబోయే భర్తతో మాట్లాడేందుకు ఆ యువతి పలుసార్లు ఫోన్ చేస్తోంది. కానీ చేసుకోబోయే అమ్మాయితో కాకుండా ప్రేయసితోనే ఎక్కువగా అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. అయితే ఒకరోజు అనుకోకుండా అడ్డంగా బుక్ అయ్యాడు. 

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

ప్రియురాలితో మాట్లాడుతుండగా పెళ్లి చేసుకునే అమ్మాయి కాల్ చేసింది. లవర్ కాల్‌ హోల్డ్‌లో పెట్టి కాబోయే భార్య కాల్ లిఫ్ట్‌ చేశాడు.  బైక్‌పై ఉన్నానని, కాసేపాగి మళ్లీ కాల్‌ చేస్తానని చెప్పాడు. అయితే ఆమె కాల్‌కట్ చేయబోగా అనుకోకుండా అది మెర్జ్‌ అయింది. దీంతో ఇద్దరు యువకులతోపాటు అతను కాన్ఫరెన్సు కాల్‌లో ఉన్నాడు. లవర్ మాట్లాడుతున్న విషయాన్ని గుర్తించి ఆ అమ్మాయి వెంటనే తన ఇంట్లో వారికి చెప్పింది.  ఫోన్ కాల్ రికార్డు చేసి అందరికీ వినిపించింది. ఈ ఘటనతో పెళ్లి రద్దు చేసుకోవడంతోపాటు కట్నం డబ్బులను తిరిగి తీసుకున్నారు.

Also Read: అలా ఎలా చిక్కావమ్మా.. ఒక్క వాట్సాప్‌ కాల్‌తో టీచర్‌ నుంచి రూ.78 లక్షలు మింగేసిన కేటుగాళ్లు!

phone-call | marriage | lover | today telugu news 

Advertisment
తాజా కథనాలు