/rtv/media/media_files/2025/02/03/JrUPpxVU7wM2wK0tCK9g.jpg)
masthan sai
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని సోమవారం నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో చాలామంది అమ్మాయిలను మస్తాన్ సాయి దగ్గర చేసుకుని వారితో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలను రికార్డ్ చేసినట్లుగా లావణ్య ఆరోపిస్తుంది. అయితే లావణ్య ఆరోపణలపై మస్తాన్ సాయి స్పందించాడు.
Also Read : అభిషేక్ నీ ఆటకు ఫిదా.. పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
లావణ్య చెబుతున్న ఆ వీడియోలలో ఉన్నది తన భార్య, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు.. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. అవి 2017లో హనీమూన్ కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలని.. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపాడు. వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించిందని మస్తాన్ సాయి ఆరోపించాడు. వాటిని తన వద్ద పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తుందన్నాడు మస్తాన్ సాయి.
Also Read : ''అయ్యో మేడమ్''.. కాలుజారి కింద పడిపోయిన మేయర్ విజయలక్ష్మి, వీడియో వైరల్
200కు పైగా నగ్న వీడియోలు
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా నగ్న వీడియోలు ఉన్నాయని, ఇందులో సినిమా రంగానికి చెందిన వారి వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య ఆరోపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అంతేకాదు సెలబ్రిటీల బాత్‌రూమ్, బెడ్‌రూముల్లో స్పై కెమెరాలు పెట్టి రహస్యంగా వీడియోలు రికార్డు చేశాడంటూ లావణ్య తన ఫిర్యాదులో వెల్లడించింది. మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో ఎవరీ వీడియోలు ఉన్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక హీరో రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి కారణమంటూ లావణ్య పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.
Also Read : కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. ఏం జరిగిందంటే..?