Prabhas Fauji: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న డైరెక్టర్..?

ప్రభాస్ నటిస్తున్న హను రాఘవపూడి సినిమా క్లైమాక్స్‌లో ఆయన పాత్ర మరణించే అవకాశం ఉందన్న వార్త వైరల్ అవుతోంది. ‘సీతారామం’, ‘అందాల రాక్షసి’లాగే భావోద్వేగభరిత ముగింపుతో ఉండబోతోందా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

New Update
Prabhas Fauji

Prabhas Fauji

Prabhas Fauji: టాలీవుడ్ పాన్-ఇండియా స్టార్ ప్రభాస్- హను తాజా చిత్రం క్లైమాక్స్ పై వస్తున్న రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి, దర్శకుడు హను రాఘవపూడి క్లైమాక్స్‌లో హీరో మరణించేలా స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నారనే సమాచారం బయటికొచ్చింది. ఈ సినిమా ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో భావోద్వేగాలు, యాక్షన్‌, దేశభక్తి అంశాల మేళవింపు ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read:నందమూరి తమన్ మొదటి జీతం ఎంతో తెలిస్తే షాకే..!

తెలుగు సినిమా ప్రేక్షకుల్లో తరచూ కనిపించే ఓ సెంటిమెంట్ ఏంటంటే  వాళ్ల అభిమాన హీరో చివర్లో చనిపోతే అసహనం వ్యక్తం చేస్తారు. కథ డిమాండ్ అయినా ఫ్యాన్స్ ఒప్పుకోరనే పరిస్థితి ఉంది. కానీ అదే తమిళనాట అయితే కథకి అనుగుణంగా హీరో మరణించడం సహజమే. ఉదాహరణకి విజయ్ కాంత్ నటించిన ‘రమణ’ సినిమాలో ఆయనకి ఉరిశిక్ష వేస్తారు. అదే స్క్రిప్ట్‌ను చిరంజీవి హీరోగా తెలుగులో ‘ఠాగూర్’గా తెరకెక్కించినప్పుడు, క్లైమాక్స్ మార్చి శిక్ష తక్కువగా వేసినట్టు చూపారు. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చివర్లో ఎన్టీఆర్ శిక్ష నుండి తప్పించుకుంటారు, అదే సినిమాను విశాల్ రీమేక్‌ చేసినప్పుడు ఆయన పాత్రను ఉరి శిక్ష తీస్తారు.

Also Read:‘జటాయు’కి ప్రభాస్ సెట్ కాడు..

అయితే ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల్లోనూ మార్పు కనిపిస్తోంది. కథ ప్రాముఖ్యతను బట్టి, ఎమోషనల్ కంటెంట్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి సినిమాలు దుల్కర్ సల్మాన్ పాత్ర చివర్లో చనిపోయినప్పటికీ, ఆ క్యారెక్టర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే డైరెక్టర్ హను రాఘవపూడి తీసిన మొదటి చిత్రం ‘అందాల రాక్షసి’లో కూడా హీరో పాత్ర మరణిస్తుంది.

Also Read:యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

ప్రభాస్ పాత్ర చనిపోతుందా..?

ఇప్పుడు అదే టెంప్లేట్‌ను ప్రభాస్ సినిమాకూ కూడా చేస్తారా..? అనే చర్చ నడుస్తోంది. ఈ కథలో ప్రభాస్ పాత్ర భావోద్వేగాలతో వహిరావలో చనిపోతుందా..? లేక ప్రేక్షకుల కోసం హను స్క్రిప్ట్‌ను మార్చుతాడా? అన్నదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

సాధారణంగా హను రాఘవపూడి సినిమాల్లో ఎమోషనల్ ఎండ్ ఓ ముద్రలా ఉంటుంది. కాబట్టి ప్రభాస్‌ పాత్రకు క్లైమాక్స్‌లో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
తాజా కథనాలు