World Tallest Bridge : ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ప్రారంభించిన చైనా.. హైట్ తెలిస్తే షాక్!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిను చైనా ప్రారంభించింది. ఈ వంతెన నిర్మాణంతో ఇక్కడి ప్రయాణికులకు రెండు గంటల సమయం ఆదా అవుతోంది. గతంలో చుట్టూ తిరిగి వెళ్లడానికి పట్టే రెండు గంటల సమయం పట్టేది.

New Update
World's Tallest Bridge

ప్రపంచంలోనే ఇంజినీరింగ్ అద్భుతాలకు చిరునామాగా నిలుస్తున్న చైనా మరో చారిత్రక నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిను చైనా ప్రారంభించింది. ఈ వంతెన నిర్మాణంతో ఇక్కడి ప్రయాణికులకు రెండు గంటల సమయం ఆదా అవుతోంది. గతంలో చుట్టూ తిరిగి వెళ్లడానికి పట్టే రెండు గంటల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం రెండు నిమిషాల్లో బ్రిడ్జ్ దాటిపోతున్నారు.

చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని లోతైన గ్రాండ్ కాన్యన్ లోయపై ఈ వంతెనను నిర్మించారు. నది గర్భం నుంచి ఈ వంతెన దాదాపు 625 మీటర్లు (2,051 అడుగులు)ఎత్తులో ఉంది. ఇది పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే కూడా దాదాపు 30 మీటర్లు ఎక్కువ. ఈ వంతెన పొడవు 2,900 మీటర్లు.

ముఖ్యంగా పర్వత ప్రాంతంలో ఇంత పెద్ద విస్తీర్ణం కలిగిన వంతెనను నిర్మించడం కష్టమైన పని. 2022లో ప్రారంభమైన ఈ నిర్మాణం దాదాపు రూ. 2,400 కోట్ల ఖర్చుతో పూర్తి అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 22,000 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఇది మూడు ఈఫిల్ టవర్ల బరువుతో సమానం.

Advertisment
తాజా కథనాలు