Argentina Women Tortured : ముగ్గురు యువతులు హత్య.. ఇన్‌స్టా లైవ్‌లో చిత్ర హింసలు పెట్టి..

డ్రగ్‌ మాఫియా చేతిలో అనేకమంది అమాయకులు బలవుతున్నారు. తాజాగా ఓ డ్రగ్ డీలింగ్ గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టింది. అర్జెంటీనాలో ముగ్గురు యువతుల్ని అత్యంత పాశవికంగా హత్యచేసింది. ఆ ఘోరాన్ని ఇన్ స్టాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆ దేశ వ్యాప్తంగా దుమారం రేపింది.

New Update
Three young women murdered

Three young women murdered

Argentina Women Tortured: డ్రగ్‌ మాఫియా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఈ దేశం ఆ దేశం అని లేదు. ప్రతిదేశం డ్రగ్‌ చట్రంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఇప్పటికీ దాని నుంచి బయటపడలేక అనేక దేశాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఆ రొంపిలోకి దిగిన యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.  డ్రగ్‌ మాఫియా చేతిలో అనేకమంది అమాయకులు బలవుతున్నారు. తాజాగా ఓ డ్రగ్ డీలింగ్ గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టింది. ముగ్గురు యువతుల్ని నమ్మించి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా హత్యచేసింది. అర్జెంటీనాలో ముగ్గురు యువతులను చిత్ర హింసలు పెట్టి హత్య చేసిన డ్రగ్స్ మాఫియా ఆ ఘోరాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆ దేశ వ్యాప్తంగా దుమారం రేపింది.

Three young women murdered


 అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురు యువతులను చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేసింది ఓ గ్యాంగ్. ఈ తతంగాన్ని ఇన్‌స్టాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వివరాల ప్రకారం  బ్యూనస్ ఎయిర్‌ ప్రావిన్స్‌ ప్రాంతానికి చెందిన మొరేనా వర్డీ, బ్రెండా డెల్ క్యాస్టిలో, మరో యువతి కుటుంబ సభ్యులకు తెలియకుండా సెక్స్‌ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు డ్రగ్స్‌ అమ్మకాల్లోనూ తలదూర్చినట్లు తెలుస్తోంది.

అయితే కొద్దిరోజుల క్రితం ఆ ముగ్గురు యువతులు చేసిన చిన్న తప్పిదం వారి ప్రాణాలు పోయేలా చేసింది. వీరు పనిచేసే డ్రగ్ డీలింగ్ గ్యాంగ్‌ నుంచి వీరు కొంత మొత్తం డ్రగ్స్ దొంగిలించినట్లు తెలిసింది. ఈ విషయం ఆ గ్యాంగ్ లీడర్‌కు తెలిసి పోయింది. వెంటనే అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇకపై తన గ్యాంగ్‌లో పని చేసే వారు ఎవ్వరూ ఇలంటి పని చేయకుండా ఉండాలంటే కఠినంగా ఉండాలనుకున్నాడు.  దీంతో ఓ క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ గ్యాంగ్‌ లీడర్‌ ఆ ముగ్గురు యువతుల్ని నమ్మించి తన డెన్‌కు తీసుకు పోయాడు. అనంతరం వారిని ఓ చోట బంధించి చిత్ర హింసలకు గురి చేశాడు. దీన్నంతా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు.ఆ  డ్రగ్‌ లీడర్‌  యువతుల వేళ్లు కత్తిరించాడు.. గోళ్లు పీకాడు.. ఇష్టం వచ్చినట్లు విచక్షణ రహితంగా కొట్టి చంపేశాడు. నిందితుల్లో ఒకరు యువతుల హత్యను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తన దగ్గర డ్రగ్స్ దొంగిలిస్తే ఇలాగే జరుగుతుందంటూ ఆ గ్రూపు నాయకుడు హెచ్చరించినట్లు ఆ వీడియోలో ఉంది.


ఈ వ్యవహారం ఇప్పుడు ఆ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. యువతీయువకులు రోడ్లపైకి వచ్చినిరసనలు, ఆందోళనకు దిగారు.ముగ్గురు యువతుల దారుణ హత్యతో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్‌ ప్రావిన్స్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జనం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.బ్యూనస్ ఎయిర్‌ వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇక, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  ఓ నిందితుడ్ని పోలీసులు పట్టుకుని విచారణ చేపట్టారు. అతడి వద్ద నుంచి చిత్ర హింసలకు సంబంధించిన ఓ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి 20 ఏళ్ల పెరువియన్ యువకుడి ఫోటోని పోలీసు అధికారులు విడుదల చేశారు. అతడు ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై న్యాయం జరగాలని యువతుల పేరెంట్స్ చెబుతున్నారు. అసలైన నిజం బయటకు రావాలని, ఈ విషయంలో తాము భయపడేది లేదని వెల్లడించారు.

Also Read :  పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్ పై అత్యాచారం

Advertisment
తాజా కథనాలు