/rtv/media/media_files/2025/05/19/Ib6DPrmOMxp6BmzYX00n.jpg)
Trump rejects mangoes
Donald Trump : భారత్‌తో స్నేహం నటిస్తూనే మనకు అమెరికా ద్రోహం చేస్తోందా? మనదేశంపై ఆధిపత్యం కోసం ట్రంప్ పాకులాడుతున్నాడా? అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఇండియాపై కక్ష కట్టాడనే అరోపణలు వినవిస్తున్నాయి. మనతో స్నేహం చేస్తూనే మన శత్రుదేశాలతో వ్యాపార లావాదేవీలు చేస్తున్నాడనే విషయం ఇప్పటికే రుజువైంది. కాగా ఈసారి మన భారతీయ రైతులకు నష్టం జరిగేలా తీసుకున్న నిర్ణయంతో రూ.4 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు.
Also Read: జమ్మూకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
వివరాల్లోకి వెళితే అమెరికా అధికారులు ఇండియా నుంచి వెళ్లిన దాదాపు 15 కంటైనర్ల మామిడి పళ్లను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిసింది.అమెరికాలోని లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా మరికొన్ని విమానాశ్రయాలకు చేరుకున్న భారతీయ మామిడి పళ్లను సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంతో పండ్లను నిరాకరించినట్లు తెలిసింది. దీంతో ఎగుమతిదారులు వాటిని వెనక్కి తీసుకెళ్లలేక, వదిలేయలేక తలలు పట్టుకున్నారు. మామిడి పళ్లను తిరిగి ఇండియాకు తీసుకు రావాలంటే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉండడంతోపాటు పండ్లు పాడయ్యే అవకాశం ఉండటంతో వాటిని అమెరికాలోనే పడేయ్యాలని వారు నిర్ణయించుకున్నారు.
Also Read: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
అమెరికా అధికారులు తీసుకున్న ఈ చర్యతో ఎగుమతిదారులకు దాదాపు రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తేలింది. నిజానికి అమెరికాకు పంపించే మామిడి పండ్లకు ముందుగా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గుర్తింపు పొందిన ఫెసిలిటీలో ఇరేడియేషన్ ప్రక్రియ నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల సూక్ష్మజీవులు తొలగిపోవడంతో పాటు పండ్ల నాణ్యతను మెరుగుపడుతుంది. అలాగే పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కానీ వీటి జారీలో తప్పిదాలు జరిగడంతో అమెరికా ఎయిర్ పోర్టుల్లో పండ్లు రిజెక్ట్ చేశారు. ఈ పండ్లన్నీ కూడా ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించినవి.
Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
ఈ విషయమై ఎగుమతి దారులు మాట్లాడుతూ తాము అమెరికా గుర్తింపు పొందిన కేంద్రానికే పండ్లు పంపామని, ఆ అధికారులు ఇచ్చిన ధృవీకరణను వారే అంగీకరించటం లేదని వాపోయాడు. అమెరికా అధికారి నుంచి క్లియరెన్స్ రాకుండా ముంబై ఎయిర్ పోర్టులో వాటిని లోడింగ్ కూడా చేయరని, అలాంటిది లోడింగ్ చేసి తీసుకెళ్లాక రిజక్ట్ చేయడం సరికాదన్నారు. ఇదంతా చూస్తుంటే కావాలనే తిరస్కరించినట్లుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా తీసుకున్న నిర్ణయంతో తమకు కోట్లలో నష్టం వచ్చిందని వారు వాపోయారు.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్