/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)
Trump
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ని చర్చల కోసం సంప్రదించామన్నారు. కానీ.. ఇప్పుడు చాలా ఆలస్యం అయిందని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే వారం ఇరాన్‌కు చాలా గొప్పగా ఉంటుందని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్‌కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధానికైనా, శాంతికైనా అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హేగ్సెత్ పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆర్డర్స్ కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. అనుమతి రాగానే ఇరాన్‌పై అటాక్ చేస్తామని తెలిపారు.
Also Read : ఇరాన్‌కు అండగా ఏకమైన 21 ఇస్లామిక్ దేశాలు
America-Iran War - Trump
వైట్ హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. వారం క్రితం, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఇరాన్ విషయంలో ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదని అన్నారు. ఇరాన్,-ఇజ్రాయెల్ వివాదం ఎప్పటివరకు ఉంటుందో తనకు ఖచ్చితంగా తెలియదని ఆయన అన్నారు. కానీ.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ మాత్రం పూర్తిగా నాశనం చేయబడిందని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read : ఇజ్రాయెల్‌కు సాయం చేయొద్దు.. అమెరికాకు పుతిన్ వార్నింగ్..
అమెరికా తీరుపై ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యుద్ధంలో జోక్యం చేసుకుంటే అగ్రరాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తామని బుధవారం హెచ్చరించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపొవాలంటూ మంగళవారం ట్రంప్ చేసిన సూచనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు తాము లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు ఖమేనీ. ఇరాన్ గురించి తెలిసిన వారెవరూ ఇలా బెదిరించరని.. ఎందుకంటే ఇరాన్ లొంగిపోయే దేశం కాదని వారికి తెలుసని ఖమేనీ అన్నారు.
Also Read : భారీ వరదలు.. 48గంటల్లోనే 22 మంది మృతి
Also Read : ఆపరేషన్ సింధూ ప్రారంభించిన కేంద్రం
america | trump | iran-israel | latest-telugu-news | iran israel war | iran israel conflict | 47th us president donald trump | america iran war trump | iran israel tensions