/rtv/media/media_files/2025/06/19/russia-warns-us-against-military-aid-to-israel-amid-escalating-iran-israel-strikes-2025-06-19-07-48-28.jpg)
Russia Warns U.S. Against Military Aid to Israel Amid Escalating Iran-Israel Strikes
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. రష్యా సంచలన ప్రకటన చేసింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. ఒకవేళ జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అక్రమంగా దాడులు చేస్తోందని.. ఈ దాడుల వల్ల అణు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి మేము సిద్ధమేనన్నారు.
Also Read: ఇరాన్‌పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. ఇజ్రాయిల్ అండగా రంగంలోకి అమెరికా!
Russia Warns U.S - Iran-Israel Strikes
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ అణు ముప్పును తాము ఓ వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు చెప్పాయి. ఇప్పటికే ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. '' మేము ఓ పద్ధతి ప్రకారం ఇరాన్‌లో అణు స్థావరాలను ధ్వంసం చేస్తున్నాం.
Also Read: ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు
మేము చేసే దాడులు వాళ్ల నష్టాన్ని మరింత పెంచుతున్నాయి. ఫలితంగా వాళ్ల బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని'' తెలిపారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉండగా గత శుక్రవారం నుంచి ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడులు చేస్తోంది. పశ్చిమ ఇరాన్, టెహ్రాన్ గగనతంలపై తాము పూర్తిగా పట్టు సాధించామని ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 70 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలు ధ్వంసం చేశామని చెప్పాయి.
Also Read : 'కుబేరా' నుంచి ధనుష్ ఎమోషనల్ ట్యూన్.. వింటే కన్నీళ్లు ఆగవు!
Also Read : లక్ అంటే ఇదే.. నక్కతోక తొక్కిన ఫ్యామిలీకి దొరికిన రూ.10లక్షల వజ్రం
telugu-news | national-news | rtv-news | putin | israel iran war