Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్‌ అంగీకారం!

ముంబయి భీకర ఉగ్రదాడి దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది.

New Update
mumbai attacks

mumbai attacks

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకపుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం.

Also Read:Fastag: ఫాస్టాగ్‌ యూజర్లకు అలర్ట్‌..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్‌!

26/11 ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌ కు అప్పగిస్తున్నాం అని అని ట్రంప్‌ విలేకరులతో పేర్కొన్నారు. ఈ ప్రకటన పై మోదీ హర్షం వ్యక్తం చేశారు.ముంబై ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌ కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌ నకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు.

Also Read: Telangana: తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం నిజమే..నిర్మలా సీతారామన్‌!

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌ కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్‌ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్‌ పోరాడుతోంది. దీన్ని సవాల్‌ చేస్తూ తహవూర్‌ రాణా పలు ఫెడరల్‌ కోర్టులను ఆశ్రయించగా..ఆ న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌ లోనూ చుక్కెదురైంది.

దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబర్‌ 13 వ తేదీన అమెరికా సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఙప్తి చేస్తూ..20 పేజీల అఫిడవిట్‌ ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌ కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. తాజాగా రాణా అప్పగింత పై ట్రంప్‌ ప్రకటన చేశారు.

దీంతో మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌ కు అప్పగించే అవకాశాలున్నాయి.26/11 దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్ మైండ్‌ గా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించారు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది.

రాణా, హెడ్లీ పై ఉగ్ర దాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన తరువాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు.పాకిస్థాన్‌ ఉగ్రవాదులు నవంబర్‌ 26, 2008 రాత్రి పాక్‌ నుంచి కొలాబా సముద్రతీరానికి చేరి ముంబైలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌ లోకి చొరబడ్డారు. వెంటనే వారి చేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు.

ఆనాడు వరుసగా 12 చోట్ల దాడులు జరిగాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు విడిచారు. 

Also Read: Modi-Trump: ట్రంప్‌ తో మోదీ భేటీ..ఏ విషయాలు గురించి చర్చించుకున్నారంటే!

Also Read:Ayodhya Satyendra Das: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి

Advertisment
తాజా కథనాలు