Modi-Trump: ట్రంప్‌ తో మోదీ భేటీ..ఏ విషయాలు గురించి చర్చించుకున్నారంటే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఈ సమావేశంలో సుంకాలు, వలసలు ఇరుదేశాల  వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

New Update
usa

PM Modi, USA President Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ తో కలసి వైట్‌హౌస్‌ కు చేరుకున్న మోదీ..ట్రంప్  తో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి.

Also Read: Manchu Manoj : నన్ను తొక్కాలని, నలపాలని చూస్తారా? మీ వల్ల కాదు -మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

సుంకాలు, వలసలు ఇరుదేశాల  వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు.భారత్‌ కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమని ట్రంప్‌ అన్నారు.చాలా ఏళ్లుగా మోదీ నాకు స్నేహితుడు, మా స్నేహాన్ని రానున్ననాలుగేళ్లు కొనసాగిస్తాం.

మంచి చేయాలని...

ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా మాకు అయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి భారత్ కు కావాలి.మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయి.దేశాలుగా భారత్‌ అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యం. మేం ఎవర్నీ ఓడించాలనుకోవట్లేదు. మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించిందని ట్రంప్ అన్నారు.

Also Read: Ranveer Allahbadia: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం

వైట్‌హౌస్‌లో మళ్లీ ట్రంప్‌ ను చూడటం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. 140కోట్ల భారతీయులు తరుఫున ట్రంప్ నకు శుభాకాంక్షలు తెలిపారు.దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచారన్నారు.మరో 4 ఏళ్లు ట్రంప్ తో కలిసి పని చేయడం సంతోషంగా  ఉంది. భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం..అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్‌ కృషి చేయడం సంతోషం.ట్రంప్‌ లాగే నేను భారత్‌ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం.మేం రెట్టింపు వేగంతో పని చేస్తామని మోదీ అన్నారు.

బంగ్లాదేశ్‌లో అమెరికా జోక్యం చేసుకోలేదు" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు, "నేను బంగ్లాదేశ్ సమస్యను ప్రధాని మోడీకే  వదిలివేస్తున్నానని ట్రంప్‌ అన్నారు.ప్రధానమంత్రి మోదీ, "యుద్ధాన్ని ముగించడానికి సాధ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను నేను సమర్థిస్తున్నాను. యుద్ధ సమయంలో భారతదేశం తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటుంది. కానీ భారతదేశం తటస్థంగా ఉండలేదు..కేవలం అది శాంతి వైపు ఉందని నేను గట్టిగా చెబుతున్నాను" అంటూ ట్రంప్‌ అన్నారు.

Also Read: Ayodhya Satyendra Das: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి

Also Read: America: అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయులు..మండిపడుతున్న పంజాబ్‌!

Advertisment
తాజా కథనాలు