/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-6-8-jpg.webp)
Fastag
టోల్ రహదారుల పై టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త నిబంధనలు తీసుకుని వచ్చింది. ముఖ్యంగా బ్లాక్‌లిస్ట్ లో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని నిర్దేశించింది. నిర్దేశిత సమయంలో బ్లాక్ లిస్ట్ లో నుంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read: Telangana: తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం నిజమే..నిర్మలా సీతారామన్!
కొత్త నిబంధనలు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జనవరి 28నే ఓ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది. టోల్‌ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఫాస్టాగ్ ఇన్ యాక్టివ్ లో ఉంటే కోడ్ 176 ఎర్రర్ ను చూపి లావాదేవీని రిజెక్ట్ చేస్తారు.
Also Read: Horoscope: ఈ రాశి వారు రోజు శుభవార్తలు అందుకుంటారు..అంతా మంచే జరుగుతుంది!
ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్...
అలాగే స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్ యాక్టివ్ లోకి వెళ్లినా ఇదే కారణంతో లావాదేవీని తిరస్కరిస్తారు. ఇలాంటి సందర్బంలో పెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్యాలెన్స్ మాత్రమే కాదు...కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం, ఛాసిస్ నంబర్ కు , వెహికల్ నంబర్ కు మధ్య సొంతన లేకపోవడం వంటి కారణాలతో ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది.
ఉదాహరణకు ఉదయం 9 గంటలకు మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిందనుకుందాం.ఒక వేళ మీరు 10.30 కి టోల్‌ప్లాజాకు చేరుకుంటే ...ఆ లావాదేవీ రిజెక్ట్ అవుతుంది. అదే 70 నిమిషాల్లోగా బ్లాక్ లిస్ట్ కు సంబంధించిన బ్యాలెన్స్ నింపడం, పెండింగ్ కేవైసీని పూర్తి చేయడం చేస్తే లావాదేవీ సజావుగా పూర్తవుతుంది.
అదేవిధంగా టోల్ రీడ్ జరిగిన 10 నిమిషాల తర్వాత కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు.కాబట్టి ఈ నిబంధన గురించి వాహనదారులు తెలుసుకోవడం ముఖ్యం. ఫాస్టాగ్‌ను చివరి నిమిషంలో రీఛార్జీ చేసే అలవాటు ఉన్న వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే రీఛార్జీ చేసుకోవడం మంచిది.
Also Read: Modi-Trump: ట్రంప్ తో మోదీ భేటీ..ఏ విషయాలు గురించి చర్చించుకున్నారంటే!
Also Read: Ranveer Allahbadia: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం