/rtv/media/media_files/2025/04/26/CZMRZIIAb4mG0bQLUL2a.jpg)
witcoff
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఈ విషయాన్ని ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.దీనిని ఇప్పటి వరకు క్రెమ్లిన్ వర్గాలు ధ్రువీకరించలేదు.
Also Read: AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!
మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ స్పందిస్తూ..యుద్ధానికి ముగింపు పలికేలా..అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి మాస్కో సిద్ధంగా ఉందని ప్రకటించారు.కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు సరైన మార్గంలో ఆలోచించడం వల్లే..ప్రస్తుతం సవ్య దిశలో ప్రయాణిస్తున్నామన్నారు.
యుద్ధానికి పరిష్కారంకోసం ఇప్పటికే విట్కాఫ్ మూడు సార్లు మాస్కోను సందర్శించారు.ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు పుతిన్‌తో మాట్లాడారు. ఈ చర్చల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి కనిపిస్తోందని నిన్న ట్రంప్ పేర్కొన్నారు.
సైన్యంలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న ఓ జనరల్ కారు బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయారు.రష్యా ఆర్మీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ లో డిప్యూటీ చీఫ్ గా పని చేస్తున్న యారోస్లోవ్ మొస్కాలిక్ గా ఆయన్ని గుర్తించారు.కారు పక్కనే ఉంచి ఓ గ్యాస్ సిలిండర్ లో బాంబును పెట్టి దానిని రిమోట్ సాయంతో పేల్చేసినట్లు గుర్తించారు.
కానీ,ఈ దాడికి కారణం ఎవరో కచ్చితంగా తెలియరాలేదు.రష్యా సైన్యం నిర్వహించే ప్రధాన ఆపరేషన్ల విషయంలో డైరెక్టరేట్ చీఫ్ కు యారొస్లోవ్ సహాయకారిగా ఉంటారు.ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఆయనది చాలా కీలక పాత్ర.
Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?
trump | russia | mascow | putin | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates