/rtv/media/media_files/2025/04/25/M9YUCLQoJozV0z0NbQsa.jpg)
chandrababu srikakulam
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు. ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
మరో ఎన్నికల హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం..
— Telugu Stride (@TeluguStride) April 25, 2025
రేపు 'మత్స్యకారుల సేవలో' పథకం ప్రారంభం.. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు.. సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం.. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేలు అందజేత.. పథకం ద్వారా 1,29,178… https://t.co/ZvntfphEz1