/rtv/media/media_files/2025/07/15/vivo-x-fold-5-smartphone-2025-07-15-13-29-37.jpg)
vivo x fold 5 smartphone
Vivo భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo X Fold 5 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ముందు భాగంలో 20-మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
Vivo X Fold 5 Price India
Vivo X Fold 5 సింగిల్ వేరియంట్‌లో వచ్చింది. దీని 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 14 నుండి సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. Vivo X Fold 5 ఫోన్ టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లో వస్తుంది.
Vivo X Fold 5 Specifications
Vivo X Fold 5 స్మార్ట్‌ఫోన్‌లో 8.03-అంగుళాల AMOLED ప్రైమరీ డిస్‌ప్లే ఉంది. ఇది 2480 × 2200 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. అదే సమయంలో 6.53-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే అందించారు. ఇది 2748 × 1172 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
Vivo X Fold 5 Camera
Vivo X Fold 5 లో Adreno 750 GPU తో Qualcomm Snapdragon 8 Generation 3 ప్రాసెసర్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 పై పనిచేస్తుంది. Vivo X Fold 5 వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో ఆప్టికల్ జూమ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20-మెగాపిక్సెల్ మొదటి ఫ్రంట్ కెమెరా, 20-మెగాపిక్సెల్ రెండవ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP5X, IPX8, IPX9 రేటింగ్ అందించారు.