Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!

Vivo X200 FE ప్రారంభ ధర రూ54,999గా ఉంది. Dimensity 9300+ SoC, AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో వస్తుంది. Oppo Reno 14 Pro 5G ప్రారంభ ధర రూ.49,999గా ఉంది. Dimensity 8450 ప్రాసెసర్, OLED డిస్‌ప్లే, 6200mAh బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగి ఉంది.

New Update
Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G

Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Vivo, Oppo బ్రాండ్‌లు తమ సరికొత్త మోడల్‌లతో పోటీ పడుతున్నాయి. ఇటీవల విడుదలైన Vivo X200 FE, Oppo Reno 14 Pro 5G ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు ఫోన్‌ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

Vivo X200 FE 5G Price

Vivo X200 FE భారతదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో Vivo X200 FE మొబైల్ 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.54,999గా ఉంది. అదే సమయంలో 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ రూ. 59,999గా నిర్ణయించింది. 

Vivo X200 FE 5G specifications

Vivo X200 FE ఫోన్ 6.31-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 9300+ SoC ప్రాసెసర్‌తో వస్తుంది. Vivo X200 FE వెనుక కెమెరాలు ZEISS ఆప్టిక్స్‌తో వస్తాయి. అందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా అందించారు. ఇది 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. Android 15 ఆధారిత FuntouchOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. నీరు/ధూళి నిరోధకత కోసం IP68, IP69 రేటింగ్‌ను పొందుతుంది. ఇది జూలై 23 నుండి సేల్‌కి అందుబాటులో ఉంటుంది.

Oppo Reno 14 Pro 5G Price

Oppo Reno 14 Pro 5G కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో Oppo Reno 14 Pro 5G మొబైల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999గా ఉంది. అదే సమయంలో 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ రూ. 54,999గా నిర్ణయించింది. 

Oppo Reno 14 Pro 5G specifications

Oppo Reno 14 Pro 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.83-అంగుళాల 1.5K LTPS OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. MediaTek Dimensity 8450 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. Oppo Reno 14 Pro 5G వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. అదే సమయంలో ఫోన్ ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 

ఇందులో 80W SuperVOOC వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,200mAh బ్యాటరీ అందించారు. Android 15 ఆధారిత ColorOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. నీరు/ధూళి నిరోధకత కోసం ఇది IP66, IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది. Oppo Reno 14 Pro 5G ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, USB టైప్-C 2.0 పోర్ట్, AI ఫీచర్లు (AI Unblur, AI Recompose, AI Call Assistant, Google Gemini సపోర్ట్) ఫీచర్లు ఉన్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు