/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold
ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ఒక్కో రోజు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా...ఎక్కువ రోజులు మాత్రం హై లోనే ఉంటోంది. ఇండియాలో తులం బంగారం ధర దాదాపుగా లక్షకు దగ్గరలో ఉంది. ఇది మరింత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వాణిజ్య యుద్ధం, అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం..మాంద్యంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో బంగారం మీద పెట్టుబడులు పెట్టడం మంచిదని చెబుతున్నారు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్.
ప్రస్తుతం బంగారం ధర మార్కెట్ో పరుగులుపెడుతోంది. సుంకాల పెంపుదల వీటిని మరింత పెరిగేలా చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు, బంగారం ధరలు డజనుకు పైగా రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. అమెరికా మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 3000 డాలర్లకు చేరుకుంది. ఇండియాలో అయితే తులం పసిడి ధర లక్షకు చేరువలో ఉంది. ఇప్పటికే ఈ ధరలు ఆల్ టైం హైకు చేరుకున్నాయి. అయితే ఇవి మరింత పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఈ టైమ్ లో బంగారం ఎక్కువున్నా కూడా కొనొచ్చని చెబుతున్నారు. నష్టపోయేది ఏమీ ఉండదని అంటున్నారు. రాబోయే రెండు ఏళ్ళల్లో బంగారం మరింత పెరిగే అవకాశమే తప్ప తగ్గే ఛాన్సెస్ కనిపించడం లేదని అంటున్నారు దిడైలీ గోల్డ్ వ్యవస్థాపకుడు జోర్డాన్ రాయ్-బైర్న్ అన్నారు.
పెట్టుబడులు ఎలా పెట్టాలి..
అయితే బంగారంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. బంగారం కొనాలనుకునేవారు నాణేలు, కడ్డీల రూపంలో కొనకుండా భౌతిక బంగారం ధరను ట్రాక్ చేసే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టాలని సిఫార్స్ చేస్తున్నారు. దీని కోసం గోల్డ్ బులియన్ ETF అత్యంత అర్ధవంతంగా ఉంటుందని నేను అంటున్నారు. ETF.com ప్రకారం, SPDR గోల్డ్ షేర్స్ ( GLD ) మరియు iShares గోల్డ్ ట్రస్ట్ ( IAU ) రెండు అతిపెద్ద బంగారు ETFలని చెబుతున్నారు. ఆర్తి మాంద్యాల భయం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా బంగారం పెట్టుబడులు బాగా పని చేస్తాయని స్పష్టం చేశారు. బంగారు నాణేలు, కడ్డాలు లాంటివి కూడా కొనవచ్చని అంటున్నారు. ఇలాంటి కొనుగోళ్లు వస్తువులు, సేవల మార్పిడికి సహాయపడతాయని చెప్పారు. అయితే బంగారు ఆభరణాలు కొనాలనుకుంటే మాత్రం అధిక నాణ్యత గల ఆభరణాలు జాగ్రత్తగా ఎంచుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇవి మానసికంగా ప్రజల్లో ధైర్యాన్ని నింపుతాయని నిపుణులు చెబుతున్నారు.
today-latest-news-in-telugu | gold | silver | finance | investments
Also Read: AP: గ్లోబల్ యంగ్ లీడర్ గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపిక