/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-32-1-jpg.webp)
రెండు, మూడు రోజుల క్షీణత తర్వాత ఈరోజు మళ్ళీ మార్కెట్లు పుంజుకున్నాయి. భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1509 పాయింట్లు (1.96%) పెరిగి 78,553 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 414 పాయింట్లు (1.77%) పెరిగి 23,852 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో 30 స్టాక్‌లలో 28 స్టాక్‌లు లాభపడగా.. మారుతి, టెక్ మహీంద్రా స్వల్పంగా క్షీణించాయి. వీటిల్లో జొమాటో 4.37%, ఐసిఐసిఐ బ్యాంక్ 3.68%, ఎయిర్‌టెల్ 3.63%, సన్ ఫార్మా 3.50%, ఎస్‌బిఐ 3.28% లాభపడ్డాయి.ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 43 సూచీలు లాభపడ్డాయి. NSE నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.23%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.05%, ప్రభుత్వ రంగ బ్యాంకులు 1.64%, ఆయిల్ & గ్యాస్ 1.23%, ఆటో 1.03% రాణించాయి.
మార్కెట్ లాభపడ్డానికి కారణాలు..
అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం భారత్ కు మేలు చేకూరుస్తోంది. దీని వలన భారత్ నుంచి ఎగుమతులు పెరుగుతాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దీని కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ దేశీ మార్కెట్ పరుగులు పెట్టింది. దాంతో పాటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల తాత్కాలిక సుంకాల ఉపశమనం భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలకు ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. దీనివలన విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లో కొనుగోళ్ళు చేస్తున్నారు. నిన్న ఏకంగా రూ.3,936 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈరోజుతో కలిపితే ఈ మొత్తం దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉంది.
ఇక బ్యాంకింగ్ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు విపరీతంగా పెరిగాయి. ఇవి దాదాపు 600 పెరిగి..సెన్సెక్స్ 1500 వరకు చేరుకోవడానికి సాయం చేశాయి. ఇండియాలాగే టారీఫ్ లవిషయంలో జపాన్ కూడా చర్చలు చేస్తోంది. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచింది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా అమెరికన్ డాలర్ బలహీన పడడం మన మార్కెట్లకు కలిసి వచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.
today-latest-news-in-telugu | stock-markets | sensex | nifty
ఇది కూడా చూడండి: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు