Viral News: భార్యకు నచ్చలేదని 27లక్షల రూపాయల కారుని చెత్త కుప్పలో పడేసిన భర్త!

రష్యాలో ఓ భర్త తన భార్య అలక తీర్చుకోవాలనుకున్నాడు. 27 లక్షల కారును ప్రేమికుల రోజు బహుమతిగా ఇస్తే అది ఆమె నచ్చలేదని తిరస్కరించింది.దీంతో మండిన భర్త ఆ కారును చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్‌ అవుతుంది.

New Update
russia  car

russia car

Viral News: వన్స్‌ భార్య అలిగిందంటే..ఆమె అలక తీర్చడానికి భర్తలు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. భార్యలను ట్రిప్పులకు తీసుకుని వెళ్లడమో..నగలు, బట్టలు కొని సర్‌ప్రైజ్‌ లు ఇవ్వడమో చేస్తుంటారు.కానీ కొన్ని సార్లు భర్తలు తెచ్చిన డిజైన్ నచ్చకో, కలర్ నచ్చకో, ధర ఎక్కువైందనో, తక్కువైందనో భార్యలు మళ్లీ మూతి ముడుచుకోవడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని సార్లు అవి మార్చి తీసుకుని రమ్మని  కూడా  భార్యలు వేదిస్తే.. భర్తలు పడే నరకయాతన ఓ రేంజ్‌ లో ఉంటుంది. 

Also Read: Telangana: విజయ డెయిరీ పాలు వాడేవారికి అలర్ట్.. చైర్మన్ షాకింగ్ ప్రకటన!

అచ్చంగా ఇలాంటి పరిస్థితే వచ్చిందో భర్తకు. కానీ అతడు మాత్రం ఆమె చెప్పినట్లు చేయకుండా.. ఆమె కోసం తీసుకు వచ్చిన లగ్జరీ కారును చెత్తకుప్పలో పడేసి చేతులు దూలిపేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ గా మారింది. రష్యా రాజధాని మాస్కో నగరానికి సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో మైటిష్చ్‌కు చెందిన ఓ జంట మధ్య తరచుగా గొడవలు వస్తున్నాయి. ఎంత సర్దుకు పోవాలనుకున్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరట్లేదు. 

Also Read: Actress Priyamani: ఛీ మీరు మనుషులేనా అసలు..పుట్టే పిల్లల గురించి కూడా అలాంటి కామెంట్లా!

దీనికి ఎలాగైనా సరే చెక్ పెట్టి భార్యతో ప్రేమగా ఉండాలనుకున్నాడు. ఇందుకోసం ఆమెకు నచ్చేది ఏదైనా పెద్ద బహుమతి తీసుకోవాలనుకున్నాడు. ఆమెకు కార్లు అంటే ఇష్టం అని  తెలియడంతో.. ఆమెకోసం ఓ లగ్జరీ కారు కొనుగోలు చేయాలనుకున్నాడు.

తెగ ఆలోచించి 27 లక్షల రూపాయల  ఎస్‌యూవీ కారును తీసుకున్నాడు. దాన్ని ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం రోజున ఇవ్వాలనుకున్నాడు. అయితే కొనుగోలుకు ముందే ఈ కారును టెస్ట్ డ్రైవ్‌కు తీసుకెళ్లగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలింతగా కారుపై కొన్నిచోట్ల డ్యామేజీలు అయ్యాయి. అవి పెద్దగా కనిపించకపోవడంతో బాగు చేయించకుండానే భార్యకు బహుమతిగా అందజేసేందుకు తీసుకెళ్లాడు. కారును బయటే పెట్టి భార్యను పిలిచాడు. సర్‌ప్రైజ్ అంటూ కారును చూపించాడు. 

చెత్త కంటైనర్‌లో...

దీంతో తెగ సంబరపడ్డ ఆమె వెంటనే వచ్చి కారును చూసింది. థాంక్స్ అంటూనే కారంతా చెక్ చేసింది. ఈక్రమంలోనే కారుపై ఉన్న డ్యామేజీలను గుర్తించి.. ఇవేంటని ప్రశ్నించింది. ప్రమాదం జరిగిందని చెప్పగా.. ఆ కారు తనకు వద్దని తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త ఆ కారును తీసుకెళ్లి నేరుగా చెత్త కంటైనర్‌లో పడేశాడు. ఇలా ఇద్దరూ వెళ్లిపోవడంతో కారు అక్కడే ఉండిపోయింది. అంత కొత్త కారు చెత్తకుప్పలో కనిపిస్తుండగా.. స్థానిక ప్రజలంతా ఆశ్చర్య పడిపోతున్నారు. ఇది ఎవరు వేశారని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కారు అక్కడే ఉంది.చెత్తకుప్పలో కారు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. ప్రజలంతా దాన్ని చూసేందుకు వస్తున్నారు. అయితే దీనిపై అధికారులు ఇంకా స్పందించలేదు. కనీసం కారును అక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేయట్లేదు.

Also Read: wasim Akram: మీ కంటే కోతులు నయం.. పాక్‌ క్రికెటర్లపై వసీం అక్రమ్‌ మండిపాటు!

Also Read: Pak-Ind: మీరు చెబితే వినే స్టేజ్ లో మేము లేము..పాక్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు