wasim Akram: మీ కంటే కోతులు నయం.. పాక్‌ క్రికెటర్లపై వసీం అక్రమ్‌ మండిపాటు!

పాక్‌ జట్టు గ్రూప్‌ స్టేజిలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.పాక్‌ మాజీ క్రికెటర్‌లు పలువురు జట్టు ఆటతీరును ఏకి పారేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం అక్రమ్‌ రిజ్వాన్‌ సేనపై విమర్శలు చేశాడు.

New Update
akram

akram

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ – 2025 ’ లో పాకిస్థాన్‌ కథ కంచికి చేరింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన పాకిస్థాన్‌.. గ్రూప్‌ స్టేజిలోనే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలై మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి వెళ్లిపోయింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌  చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన రిజ్వాన్‌ టీమ్‌.. తర్వాత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

Also Read: Musk: అందుకే వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు..: మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

పాక్‌ జట్టు గ్రూప్‌ స్టేజిలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. యావత్‌ పాకిస్థాన్‌ తమ క్రికెట్‌ జట్టు ప్రదర్శనపై మండిపడుతోంది. పాక్‌ మాజీ క్రికెటర్‌లు పలువురు తమ జట్టు ఆటతీరును ఏకి పారేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ రిజ్వాన్‌ సేనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: Hyd: ఐదు రోజులు ఎండ దంచికొడుతుంది..జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ

కోతుల కంటే ఎక్కువగా...

భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు సరైన డైట్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డైట్‌ పాటించకపోవడంతో ఆటగాళ్లు ఫిట్‌గా లేరని, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డ్రింక్స్‌ సమయంలో ఆటగాళ్ల కోసం ఒక ప్లేట్‌ నిండా అరటిపండ్లు ఉండటం చూశానని, కోతులు కూడా అన్ని అరటి పండ్లు తినవని, మా ఆటగాళ్లు మాత్రం కోతుల కంటే ఎక్కువగా తింటున్నారని వసీం అక్రమ్‌ మండిపడ్డారు. 

చెత్త ప్రదర్శన చేసినందుకు జట్టుపైన, పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డుపైన తీవ్ర చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్‌ జట్టులో ఏమాత్రం పురోగతి లేదని విమర్శించారు. పాక్‌ జట్టులో మార్పులు జరగాలని, భయంలేని క్రికెటర్‌లు, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని, ప్రస్తుత జట్టులో కచ్చితంగా ఐదారు మార్పులు చేయాలని వసీం అక్రమ్‌ సూచించారు. ఇప్పటికైనా తప్పులు తెలుసుకుని 2026 టీ20 ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేయాలని చెప్పారు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్‌ జట్టు గురువారం బంగ్లాదేశ్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Also Read:  SpaceX launched IM-2: చంద్రుడిపైకి మానవ మనుగడ.. స్పేస్X మిషన్‌లో కీలక పరిణామం

Also Read: Champions Trophy 2025: అఫ్గాన్ బ్యాటర్ రికార్డుల వర్షం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో భారీ స్కోర్!

Advertisment
తాజా కథనాలు