/rtv/media/media_files/2025/02/27/U8barpQexM0AuP9Gvr4P.jpg)
vijaya
గత కొద్దికాలంగా కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ప్రతి దానిని కల్తీ చేస్తున్నారు. వంటింట్లో నిత్యవసర సరుకులైన కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు నుంచి చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, తాగే పాలు కూడా కల్తీ చేస్తున్నారు. ఎలాంటి ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెట్‌లో వదులుతున్నారు.
Also Read: Actress Priyamani: ఛీ మీరు మనుషులేనా అసలు..పుట్టే పిల్లల గురించి కూడా అలాంటి కామెంట్లా!
వాటికి బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అంటింటి చిన్న చిన్న కిరాణా దుకాణాలు మొదలుకొని స్టార్ హోటళ్లకు కూడా సరఫరా చేస్తున్నారు. తాజాగా బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ పాలు తయారు చేస్తన్నట్లు విజయ తెలంగాణ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు.
Also Read: wasim Akram: మీ కంటే కోతులు నయం.. పాక్ క్రికెటర్లపై వసీం అక్రమ్ మండిపాటు!
నకిలీ పాలను...
విజయ డెయిరీ పేరుతో నకిలీ పాలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కొంతమంది ప్రైవేట్ డైరీ వారు విజయ పేరుతో విజయ తెలంగాణ పాల ప్యాకెట్లను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.
అలాంటి పాలను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని చెప్పారు. విజయ బ్రాండింగ్ పేరు, లాఫింగ్ కౌ లోగోను వాడుకుంటూ పాలను విక్రయించే హక్కు జిల్లా యూనియన్లు, ప్రైవేటు సంస్థలకు లేదని చెప్పారు. విజయ బ్రాండ్ ప్రైవేట్ డెయిరీలు వినియోగించడం చట్టరీత్యా నేరమన్నారు.
ఎవరైనా తెలంగాణ నకిలీ పాలను డిస్ట్రిబ్యూటర్స్ వెండర్స్ కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పారు. పాలు ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి తమ లోగోను పరిశీలించి కొనుగోలు చేయాలని గుత్తా అమిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విజయ పాలు దాని అనుబంధ ప్రొడక్ట్స్ చాలా వరకు నకిలీ తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఒరిజినల్ విజయ డెయిరీ పాలను మాత్రమే గుర్తించి వాడాలన్నారు. లేదంటే అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని తెలిపారు.
Also Read:Musk: అందుకే వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు..: మస్క్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు!