/rtv/media/media_files/xXzmGF60axhlmr39C14N.jpg)
Priyamani
యంగ్ హీరోయిన్ లకు పోటీగా అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది నటి ప్రియమణి.ఆమె ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో బిజీగా ఉంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..వివాహం చేసుకున్నప్పటి నుంచి కొందరు అయితే అదే పనిగా తనను విమర్శించడమే వారి లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.తనకు పుట్టబోయే పిల్లల గురించి కూడా కామెంట్లు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read:New traffic rule : వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!
2017 లో ముస్తాఫారాజ్ తప్రియమణి ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. 2016 లో వీరి నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి ఆన్ లైన్ వేదికగా విమర్శలు ఎదురవ్వడం ప్రారంభమయ్యాయని ప్రియమణి అన్నారు. నాకు నిశ్చితార్థం జరిగితే నా అభిమానులు, నాకు తెలిసిన వారు సంతోషిస్తారనుకున్నాను.
Also Read: SLBC Tunnel: 8మంది ప్రాణాలు డౌటే..ప్రమాదస్థలానికి అరకిలోమీటర్ దూరంలో రెస్క్యూటీమ్..
వారితో ఈ సంతోషకరమైన క్షణాలను పంచుకోవాలనుకున్నా.కానీ అప్పటి నుంచి నా పై అనవసరమైన ద్వేషం ప్రారంభమైంది.
వారిని ఐసిస్ లో...
లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చాయి. పిల్లలు పుట్టాక వారిని ఐసిస్ లో జాయిన్ చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అవి ఎంతగానో బాధ పెడుతున్నాయి. నేను మీడియా పర్సన్ ను కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోను.కానీ నా భర్త పై అలాంటి కామెంట్స్‌తో ఎందుకు దాడి చేస్తున్నారు.
అతడి గురించి వివరాలు కూడా మీకు తెలియవు. కానీ కామెంట్స్ మాత్రం చేసేస్తారు. ఇప్పటికీ కూడా నేను నా భర్తతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తే..పదిలో తొమ్మిది కామెంట్స్ మా పెళ్లి మీదనే ఉంటాయి. వాటి వల్ల బాధపడాల్సి వస్తోందని ప్రియమణి అన్నారు.
Also Read:AI: ఇక మనుషుల అవసరం ఉండదేమో!.. సీక్రెట్ భాషలో మాట్లాడుకుంటున్న రెండు ఏఐ అసిస్టెంట్స్